మాజీ మిస్ కేరళ యాక్సిడెంట్ కేసు.. ఆరుగురు అరెస్ట్.. సీసీ టీవీ ఫుటేజ్ ద్వంశం.. అసలేమైంది?
మాజీ మిస్ సౌత్ ఇండియా , మిస్ కేరళ 2019 అన్సీ కబీర్, మిస్ కేరళ 2019 ఫస్ట్ రన్నరప్ అంజనా షాజన్ మృతికి సంబంధించి ఒక హోటల్ యజమాని సహా ఆరుగురిని పలరివట్టం పోలీసులు బుధవారం నాడు అంటే నవంబర్ 17, 2021న అరెస్టు చేశారు. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే

తీవ్ర విషాదం
ఈ నెల ఒకటవ తేదీన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. మిస్ కేరళ విన్నర్, రన్నరప్ ఒకేసారి ఒకే కారులో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. ఓ బైక్‌ను తప్పించబోయి కారు ప్రమాదానికి గురి కావడంతో వాళ్లు అక్కడికక్కడే చనిపోయారు. కేరళలో జరిగిన దారుణమైన యాక్సిడెంట్‌లో మిస్ కేరళ 2019 టైటిల్ విన్నర్ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు.

ట్రిప్ వెళ్లొస్తున్న సమయంలో
ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ అనే హోటల్ ముందు తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌కు రెండు గంటల ముందు అన్సీ కబీర్ తన ఇన్‌స్టాలో ఇట్స్ టైమ్ టూ గో అని క్యాప్షన్ పెట్టి ఫోటో అప్లోడ్ చేసింది. అన్సీ, అంజనాతో పాటు ఈ కారులో మరో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నలుగురు కలిసి ట్రిప్ వెళ్లొస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

మంచి స్నేహితులయ్యారు
అమ్మాయిలు ఇద్దరూ చనిపోగా వారితో ప్రయాణిస్తున్న ఇద్దరు అబ్బాయిలకు గాయాలయ్యాయి. 2019 సంవత్సరంలో మిస్ కేరళగా అన్సీ కబీర్, రన్నరప్‌గా అంజనా షాజన్ నిలిచారు. అన్సీ తిరువనంతపురం అట్టింగల్‌లోని అలంకోడ్ నివాసి కాగా అంజనా స్వస్థలం త్రిసూర్. ఈ ఇద్దరూ 2019 అందాల పోటీలో ఒకరితో ఒకరు పోటీ పడి మంచి స్నేహితులయ్యారు.

ఇద్దరూ కలిసే
స్నేహితులుగా మారినప్పటి నుంచి ఇద్దరూ కలిసే బయటికి వెళ్లేవారు. అప్పుడప్పుడు ఇలా జాలీ ట్రిప్స్ కి కూడా వెళ్లొస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే కారులో బయలుదేరారు. అయితే ఎర్నాకుళం బైపాస్ దగ్గర ఉన్న హాలీడే ఇన్ ఎదుట ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి వాళ్ళ కారు ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు యాక్సిడెంట్ స్పాట్‌కు చేరుకున్నారు.

మొత్తం ముగ్గురు
అయితే అప్పటికే అన్సీ కబీర్, అంజనా అక్కడికక్కడే చనిపోయారు.. గాయాలైన ఇద్దరినీ ఎర్నాకులం మెడికల్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. నవంబర్ 1 అర్థరాత్రి. యాన్సి కబీర్, 25, మరియు అంజనా షాజన్, 24, ఈ ప్రమాదంలో తక్షణమే మరణించగా, ఆషిక్, కొన్ని రోజుల తరువాత అతని గాయాలతో మరణించాడు, కారు నడిపిన అబ్దుల్ రెహమాన్ మాత్రమే సాక్షిగా మిగిలిపోయాడు.
Recommended Video

ఆరుగు అరెస్ట్
అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ దర్యాప్తు లో పోలీసులు ఫోర్ట్ కొచ్చిలోని నంబర్ 18 హోటల్ యజమాని రాయ్ వాయలత్ ను అరెస్ట్ చేశారు. తన ఐదుగురు ఉద్యోగులతో కలిసి హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను ఆయన ధ్వంసం చేశారని గుర్తించారు. ఐదుగురు ఉద్యోగులను మెల్విన్, విషు, లిన్సన్, షిజులాల్, అనిల్‌గా గుర్తించారు.


Click it and Unblock the Notifications











