ప్రముఖ నటుడు కన్నుమూత.. తండ్రి కోసం కూతురు ప్రాణాలకు తెగించినా.. విషాదంలో సినీ పరిశ్రమ

మలయాళ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు విష్ణు ప్రసాద్ ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన మృతితో సినీ వర్గాలు, ప్రేక్షకులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టమైన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. ఆయన లేని లోటు తలచుకొంటూ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. విష్ణు ప్రసాద్ గురించి, ఆయన అనారోగ్యం గురించిన వివరాల్లోకి వెళితే..

విష్ణు ప్రసాద్ గత కొద్దికాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కోసం కొంత కాలంగా ఎర్నాకులంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స జరుగుతున్న సమయంలో ఆయన అపస్మారక స్థితిలోకి జారుకొన్నారు. చివరి రోజుల్లో ఆయన కోమాలోనే ఉండిపోయారు అని మలయాళ సినీ వర్గాలు వెల్లడించాయి.

Vishnu Prasad Passed away

విష్ణు ప్రసాద్‌ వయసు 49 సంవత్సరాలు. ఆయనకు భార్య, అభిరామి, అనానిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తన తండ్రిని బతికించుకోవడానికి ఆయన కూతురు లివర్‌లోని కొంత భాగాన్ని డొనేట్ చేసింది. అయినా విష్ణు ప్రసాద్‌ను బతికించుకోలేకపోవడం ఆ కుటుంబానికి మరింత విషాదంగా మారింది. తన తండ్రి కోసం ప్రాణాలను లెక్క చేయకుండా లివర్ డొనేట్ చేయడంపై అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇక విష్ణు ప్రసాద్ మరణ వార్తను ఆయన స్నేహితుడు, నటుడు కిషోర్ సత్య అధికారికంగా ప్రకటించారు. నా ప్రియమైన వారికి విషాద వార్త. విష్ణు ప్రసాద్ ఇక మనతో లేరు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. వైద్య చికిత్స జరుగుతున్న సమయంలో కోమాలో ఉండిపోయారు. శుక్రవారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

విష్ణు ప్రసాద్ కెరీర్ విషయానికి వస్తే.. మలయాళ టెలివిజన్, సినిమా రంగంలోని ప్రేక్షకులకు సుపరిచితులు. టెలివిజన్ ద్వారా నటుడిగా పరిచయమై సినీ రంగంలో తనదైన నటనతో మెప్పించారు. ఆయన నటించిన స్వయంవరం సీరియల్‌‌లో జస్టిన్ చిరకాలం గుర్తుండిపోయేలా నటించారు. పలు సీరియల్స్‌ ద్వారా మలయాళ బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

విభిన్నమైన నటనతో ఆకట్టుకొనే ఆయన కాశీ అనే సినిమా ద్వారా మలయాళ రంగానికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కై ఎతుమ్ దూరత్, రన్ అవే, లయన్, బెన్ జాన్సన్, లోకనాథన్ ఐఏఎస్, పాతక, మరాఠా నాడు తదితర చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X