twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విభేదాలు నిజమే... మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా సంతకం పెట్టలేదు: ప్రకాష్ రాజ్

    By Bojja Kumar
    |

    మలయాళ సినీ పరిశ్రమలో కొంత కాలంగా హీరో దిలీప్ వ్యవహారంలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ మీద లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో దిలీప్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసులో అతడు అరెస్టయిన వెంటనే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ) అతడి సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన దిలీప్‌కు మళ్లీ సభ్యత్వం కల్పిస్తూ 'అమ్మ' చైర్మన్‌గా ఉన్న మోహన్ లాల్ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది.

    ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆగస్టులో నిర్వహించబోయే అవార్డుల ఫంక్షన్‌కు అతడు చీఫ్ గెస్టుగా అర్హుడు కాదంటూ వంద మందికి పైగా సినీ ప్రముఖులు సంతకం పెట్టి సీఎంకు మొమోరండం సమర్పించారు. ఈ మెమోరండంలో ప్రకాష్ రాజ్ కూడా సంతకం పెట్టినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    నేను సంతకం పెట్టలేదని చెప్పిన ప్రకాష్ రాజ్

    నేను సంతకం పెట్టలేదని చెప్పిన ప్రకాష్ రాజ్

    మోహన్‌లాల్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వానికి సమర్పించిన లేఖలో తాను సంతకం పెట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇది పూర్తిగ అబద్దమని ప్రకాష్ రాజ్ తెలిపారు.

    విభేదాలు నిజమే కానీ..

    విభేదాలు నిజమే కానీ..

    నటుడు దిలీప్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంపై తనకు విభేదాలు ఉన్నాయి కానీ.... మోహన్ లాల్‌కు వ్యతిరేకంగా తాను ఎలాంటి లేఖపై సంతకం పెట్టలేదన్నారు.

    వీడియో ద్వారా క్లారిఫై చేసిన ప్రకాష్ రాజ్

    ఈ ఇష్యూలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ ప్రకాష రాజ్ వీడియో విడుదల చేశారు.

    ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి ఎలా వచ్చింది?

    ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి ఎలా వచ్చింది?

    మోహన్ లాల్‌ను స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్‌కు ఆహ్వానించవద్దంటూ జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు బిజూకుమార్ దామోదరన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖకు వందకు పైగా నటులు తమ మద్దతు తెలిపారని, వారిలో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నట్లు చెప్పడంతో.... ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, చివరకు ప్రకాష్ రాజ్ స్పందించడం జరిగింది.

    English summary
    "There is a news doing rounds that I have signed a memorandum against Mohanlaji attending the Kerala State Awards function which is false. Neither I have signed nor I am aware of such memorandum." Prakash Raj said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X