ఆ ప్రముఖ ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తానని.. వాడుకుంటున్నాడు: ప్రేమమ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఒక భూతంలా విస్తరించి పోయి ఉంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఘటనలపై మీడియా ముందుకు వచ్చారు. హాలీవుడ్ లో అయితే ఇండస్ట్రీలో వేధింపుల నేరంలో ఓ యాక్టర్ కి జైలు శిక్ష కూడా పడింది.
అలాగే మలయాళీ ఇండస్ట్రీలో హీరో దిలీప్ కూడా అరెస్టయ్యారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నానాపటేకర్ తో పాటు మరి కొంతమంది నటులు, దర్శకులు పైన హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ మీడియా ముందు తెలియజేశారు. టాలీవుడ్ లో కూడా శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ని తెరపైకి తీసుకువచ్చింది.

అయితే ఇక్కడ అది ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఇదిలా ఉంటే ప్రేమమ్ సినిమాలో నటించిన ప్రకృతి మిశ్రా ఒడిస్సా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ప్రొడ్యూసర్ సంజయ్ నాయక్ ఎంతమంది అమ్మాయిలకు హీరోయిన్ చాన్సులు ఇస్తానంటూ వాడుకుని మోసం చేసి వదిలేసాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒడిస్సా ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రకృతి మిశ్రా చేసిన ఈ ఆరోపణలపై మరి కొంతమంది నటీమణులు కూడా ముందుకు వచ్చి నిజమేనని చెప్పడం విశేషం. ప్రకృతి చేసిన ఆరోపణలు వాస్తవమంటూ పపుల్ బయాన్ అనే హీరోయిన్ మద్దతుగా నిలిచింది. అలాగే సీరియల్ నటి జాస్మిన్ రథ్ కూడా సంజయ్ నాయక్ లైంగిక వేధింపులపై నోరు విప్పింది.

ఇండస్ట్రీలో 99 శాతం మంచివాళ్ళు ఉన్న ఒక్క శాతం మంది ఇలా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను లైంగికంగా వాడుకుని వదిలేయడం అలవాటుగా మారింది అంటూ ఆరోపణలు చేశారు. అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేస్తారని, ఒప్పుకోకుంటే సినిమా ఛాన్సులు రాకుండా తొక్కేసే ప్రయత్నం కూడా చేస్తుంటారని తెలిపారు. చాలామంది హీరోయిన్లు రెండు మూడు సినిమాలకి పరిమితమై కాంప్రమైజ్ కాలేక అవకాశాలు కోల్పోయారని ప్రకృతి మిశ్రా చెప్పడం విశేషం.


Click it and Unblock the Notifications











