రేప్ కేసులో ప్రేమమ్ హీరో.. సంచలనంగా ఫైనల్ తీర్పు..

ప్రేమ కథా చిత్రాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరణ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యువత నుంచి పెద్దవారు వరకు కూడా ప్రేమ కథా చిత్రాలు ఇష్టపడతారు. అలా ఇండియా వైడ్ గా ఎన్నో అద్భుతమైన క్లాసిక్ లవ్ స్టోర్టీ సినిమాలు ఉన్నాయి. కాగా మన సౌత్ నుంచి కూడా ప్రెజెంట్ జెనరేషన్ లో అయితే కొన్ని క్లాసిక్ సినిమాలు ఉన్నాయి.

వీటిలో ఒక స్పెషల్ ప్లేస్ ని సొంతం చేసుకున్న మలయాళ హిట్ సినిమా "ప్రేమమ్" అంటే తెలియని యూత్ చాలా తక్కువ మందే ఉండొచ్చు. కాగా ఈ సినిమా తోనే ప్రెజెంట్ సౌత్ సినిమా దగ్గర టాప్ లో సాగుతున్న యంగ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా హీరోయిన్ పరిస్థితి ఇలా ఉంటే హీరో పరిస్థితి మాత్రం ఇంకోలా మారింది అని చెప్పాలి. కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ లో నాగ చైతన్య హీరోగా నటిస్తే ఒరిజినల్ సినిమాలో హీరోగా నివిన్ పౌలే నటించాడు.

Premam hero nivin pauley harassment case justice is out here is what he said

అయితే నివిన్ మలయాళంలో ఈ సినిమా సహా పలు సినిమాలు చేసినప్పటికీ తనపై కొన్ని కాంట్రవర్సీలు కూడా లేకపోలేవు. మరి ఈ యంగ్ హీరో మలయాళ సినిమా మహిళా ఆర్టిస్ట్ ల నుంచి లైంగిక వేధింపులు కూడా చేసాడు అంటూ పలు షాకింగ్ ఆరోపణలు ఎదుర్కోవడం అక్కడ చర్చకు దారి తీసింది. అలాగే అక్కడ హేమ కమిటీ తర్వాత తన పేరు కూడా ఓ నటి విషయంలో బయటకి రావడం జరిగింది.

అయితే దుబాయ్ లో తనను లైంగికంగా వేదించాడు అంటూ నివిన్ సహా మరో ఐదుగురుపై ఒకామె రేప్ కేసు పెట్టగా ఇది తర్వాత విచారణకు వచ్చింది. కాగా ఇందులో నివిన్ ఆరో నిందితుడుగా ఉండగా ఇప్పుడు ఫైనల్ గా తనపై పెట్టిన ఈ కేసుపై తీర్పు వచ్చేసింది. కాగా ఈ కేసులో నివిన్ పై పోలీసులు విచారణ జరపగా ఇందులో తన ప్రమేయం ఉన్నట్టుగా వారికి సరైన సాక్ష్యాధారాలు దొరకలేదట. అలాగే ఆమె ఆరోపించిన విధంగా కూడా నివిన్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు నిర్ధారించి తనకి క్లీన్ చిట్ ఇచినట్టుగా తెలుస్తుంది.

Premam hero nivin pauley harassment case justice is out here is what he said

దీనితో ఈ సెన్సిటివ్ కేసులో ఆరో నిందితుడుగా ఉన్న నివిన్ ని పోలీసులు తప్పించి తనకి క్లీన్ చిట్ ఇచ్చారట. సో ఈ కీలక కేసులో యంగ్ హీరో నిరపరాది అని ఇపుడు తేలింది అని చెప్పాలి. ఇక ఈ కేసు తర్వాత నివిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తనతో ఈ కష్టకాలంలో నిలిచిన ప్రతీ ఒక్కరికీ, మీ ప్రేమ అభిమానం ప్రార్ధనలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపాడు.

దీనితో తన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. మరి ఈ యంగ్ హీరో నుంచి ఈ ఏడాదిలో మలయాళీ ఫ్రమ్ ఇండియా అనే సినిమా చేయగా ఈ సినిమా తర్వాత తమిళ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇలా పలు సినిమాలతో ఈ యంగ్ హీరో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Read more about: premam nivin pauley sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X