Empuraan Controversy : నా కొడుకును బలిపశువును చేశారు.. లూసిఫర్ వివాదంపై పృథ్వీరాజ్ తల్లి
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ పరంపర ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా తెలుగులో హిట్ అయ్యిన ఈ సీక్వెల్స్ ట్రెండ్ లో ఇపుడు ఇండియా వైడ్ గా అనేకమంది స్టార్స్ సినిమాలతో కొనసాగుతుంది. అయితే అన్ని సినిమాలు కూడా బాహుబలి కాలేవు కదా అందుకే పలు సినిమాలు భారీ సీక్వెల్స్ లా వచ్చినప్పటికీ అన్నీ ఆ రేంజ్ లో ఆడియెన్స్ ని సంతృప్తి పరచలేకపోతున్నాయి.
కాగా మన సౌత్ లోనే ఎన్నెన్నో సీక్వెల్ సినిమాలు ఇపుడు వస్తుండగా వాటిలో ఊహించని విధంగా రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే కంటెంట్ పరంగా పెద్ద ఎత్తున నెగిటివిటీ మూటగట్టుకున్న భారీ సీక్వెల్ చిత్రమే 'లూసిఫర్ 2'. మలయాళ సినిమాలో భారీ హిట్ అయ్యిన ఫస్ట్ పార్ట్ కి సీక్వెల్ గా మేకర్స్ ఎల్ 2 - ఎంపురాన్ గా దీనిని తీసుకొచ్చారు.

కాగా ఈ సినిమా మీద ఉన్న హైప్ అయితే ఒక్క మళయాళ ఇండస్ట్రీ లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా కూడా ఈ సినిమా వైపు తిరిగి చూసేలా చేసింది. రిలీజ్ కి ముందే రికార్డు బుకింగ్స్, గంటల పరంగా కూడా కొత్త రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా మోహన్ లాల్ కెరీర్లోనే కాకుండా మళయాళ సినిమా దగ్గర ఒక ఆల్ టైం రికార్డు బ్రేకింగ్ ఓపెనర్ గా నిలిచింది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాని నటుడు అలాగే దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి థియేటర్స్ లో ఇలా సినిమా వచ్చిందో లేదో పలు షాకింగ్ కాంట్రవర్సీలు ఈ సినిమాపై మొదలయ్యాయి. సినిమాలో పలు ఎపిసోడ్స్ చాలా సీన్స్ కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని టాక్ స్ప్రెడ్ కావడంతో మేకర్స్ మళ్ళీ సెన్సార్ చేపించారు.
ఎంపురాన్ మూవీలో 17 కట్స్ కూడా చేయబడ్డాయి. ఇలా మళ్ళీ థియేటర్స్ లో వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. కానీ ఇక్కడ అందరి కంటే కూడా దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది. కాగా ఈ సినిమా దర్శకుడు తానే కాబట్టి ఆ కాంట్రవర్సీ సీన్స్ నిజం అని ప్రాపగాండా చేసారని అతడిపై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి.
కాగా ఇపుడు దీనిపై పృథ్వీ రాజ్ తల్లి మల్లికా సుకుమారన్ ముందుకొచ్చారు. తన కొడుకుని అంతా బలిపశువు చేస్తున్నారు అంటూ వాపోయారు. అంతే కాకుండా ఈ కాంట్రవర్సీలో తన కొడుకు ఒక్కడినే దోషిగా చూపించడం సరికాదు అని మిగతా నిర్మాతలు, హీరో మోహన్ లాల్ పై కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాగా మోహన్ లాల్ తనకి తమ్ముడు లాంటి వాడు అని కానీ సినిమా స్క్రిప్ట్ ఇలా ఉంటుంది అని హీరో సహా నిర్మాతలకు ముందు నుంచే తెలుసు కదా తెలియకుండా స్క్రిప్ట్ చదవకుండానే సినిమా చేస్తారా? ఈ మొత్తం సినిమా విషయంలో దోషిగా తన కొడుకునే చూపించడం ఎంతవరకు సమంజసం అని ఇచ్చి పడేసి తల్లి ప్రేమ చాటుకున్నారు. దీనితో మల్లికా సుకుమారన్ స్టేట్మెంట్ సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











