నీకు భార్య, పిల్లలు ఉన్నారు.. ఇంటికి రావా? సాలార్ యాక్టర్ కు భార్య షాక్
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న పలు చిత్రాల్లో తెలుగు నుంచి వెళుతున్న సినిమాలే అత్యధికంగా కనిపిస్తాయని చెప్పవచ్చు. కాగా తెలుగు ఫిలిం మేకర్స్ పలు ఊహించని భారీ కాంబినేషన్ లని సెట్ చేస్తూ ఆడియెన్స్ కి పర్ఫెక్ట్ పాన్ ఇండియా ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఓ పాన్ ఇండియా సినిమాకి మెయిన్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల నుంచి ఆయా బిగ్ స్టార్స్ ఉండాల్సిందే అనే రేంజ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇలా అన్ని భాషల్లో నుంచి ముఖ్య నటీనటుల్ని తీసుకొచ్చి సాలిడ్ ప్రాజెక్ట్ లని అందించడంలో ఎస్ ఎస్ రాజమౌళి డెఫినెట్ గా ముందు వరుసలో ఉంటారు. బాహుబలి సినిమాల నుంచే ఈ ప్లాన్ స్టార్ట్ అయ్యింది కానీ RRR లో పాన్ ఇండియా ప్రముఖ నటీనటులకి తన సినిమాలో కీలక పాత్ర అందించారు. ఇక ఇపుడు కూడా ఒక భారీ సినిమా కోసం జక్కన్న మహాయాగం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి తనతో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో ఇదే ఫార్మాట్ ని మరో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అవుతున్నాడని చెప్పవచ్చు. ఇలా తన కేజీయఫ్ 2 సహా సలార్ సినిమాల్లో ప్రముఖ పాన్ ఇండియా నటుల్ని తీసుకొచ్చుకున్నారు. ఇలా తెలుగు ఆడియెన్స్ కి మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ని కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో సలార్ తో మంచి రెస్పాన్స్ ని తాను అందుకున్నాడు కానీ ఇలా ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తుండడంతో తన భార్య ఇచ్చిన ఓ షాకింగ్ రిప్లై ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుప్రియ మీనన్ పృథ్వీ రాజ్ సుకుమారన్ భార్య కాగా ఈమె పృథ్వీ పెట్టిన ఓ పోస్ట్ కి రిప్లై ఇచ్చారు.
పృథ్వీ తాను దర్శకత్వం వహించిన లూసిఫెర్ 2 వర్క్స్ కంప్లీట్ చేసి ఇక నటుడుగా సిద్ధం అవుతున్నాను అంటూ ఓ పోస్ట్ చేయగా తన భర్తపై సుప్రియ ఇలా రిప్లై ఇచ్చారు. "గుర్తు చేస్తున్నాను: మీకు ఒక భార్య, పాప కూడా ఉన్నారు" అంటూ అలిగినట్టుగా బుంగమూతి పెట్టుకున్న ఎమోజిస్ తో రిప్లై ఇచ్చారు. దీనితో ఎపుడు పని మీదే బిజీగా ఉన్న భర్త కోసం తమని పట్టించుకోండి అన్నట్టుగా ఇచ్చిన ఈ క్యూట్ రిప్లై సోషల్ మీడియాలో వారి అభిమానులు నడుమ వైరల్ గా మారింది.
ఇక ఇదిలా ఉండగా పృథ్వీ రాజ్ ప్రిపేర్ చేసిన ఈ కొత్త లుక్ మాత్రం తన పోస్ట్ ద్వారా ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబులతో సినిమా కోసమే అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి తాను ఉన్నట్టుగా ఆ మధ్య పలు పుకార్లు కూడా వచ్చాయి కానీ ఇపుడు అవి నిజమే అన్నట్టుగా మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పైగా పృథ్వీ పోస్ట్ కి రాజమౌళి కాంపౌండ్ నుంచి ఎస్ ఎస్ కార్తికేయ కూడా లైక్ కొట్టడంతో ఈ టాలెంటెడ్ నటుడు ఈ సినిమాలో ఉన్నాడనే అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











