ఆస్కార్ లెవెల్ సినిమా థియేటర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏ సినిమా, ఎప్పుడో తెలుసా?

విభిన్నమైన కథలు, అందరినీ అలరించే అద్భుతమైన స్టోరీలను తెరకెక్కించడంలో ఎప్పుడూ ముందుడే టాలెంటెడ్ డైరెక్టర్, స్టార్ హీరో.. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం డైరెక్టర్, హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా, నేపథ్య గాయకుడిగా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. 41 ఏళ్ల వయసు ఉన్న ఈయన ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ.. అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో కనిపించాడు.

ముఖ్యంగా చియాన్ విక్రమ్ హీరోగా వచ్చిన విలన్ సినిమాలో కూడా అధ్భుతమైన పాత్రలో కనిపించిన ఈయన... ప్రస్తుతం సలార్ సినిమాలోనూ కనిపించబోతున్నాడు. అయితే ఈయన హీరోగా తాజాగా రాబోతున్న చిత్రం ది ఘోట్ లైఫ్. ఈ సినిమాను తెలుగులో ఆడుజీవితంగా తెరకెక్కించారు. జాతీయ అవార్డు గ్రహీత ఫిల్మ్ మేకర్ బ్లెస్సీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే బెన్యామిన్ రచించిన 'ఆడు జీవితం' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కస్తున్నారు.

Prithviraj Sukumaran Aadujeevitham, The Goat Life Release Date Fixed Check Details

ఐదు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అయితే అఫ్పటి నుంచి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ కూడా బయటకు రాలేదు. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అద్భుతమైన అప్ డేట్ బయటకు వచ్చింది. ఏప్రిల్ 10వ తేదీన ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదయ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

పొట్టకూటి కోసం ఏజెంట్లను నమ్మి సౌదీకి అరేబియాకు వలస వెళ్లిన ఓ యువకుడి పాత్రలో పృథ్వి రాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. అలాగే పృథ్వీ భార్యగా ఈ సినిమాలో అమలా పాల్ కనిపించబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా.. డీగ్లామరస్ పాత్రలో హీరోహీరోయిన్లు కనిపించారు. యాక్టింగ్ పరంగా అయితే అద్భుతమైన స్పందన వచ్చింది. పృథ్వీరాజ్ కెరియర్ లోనే ఈ సినిమా హైలెట్ గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు.

Prithviraj Sukumaran Aadujeevitham, The Goat Life Release Date Fixed Check Details

డైరెక్టర్ బ్లెస్సీ ఈ సినిమాపై దాదాపు 15 ఏళ్లగా పని చేస్తున్నారట. అయితే సినిమా మాత్రం కచ్చితంగా సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు వచ్చే లెవెల్ లో ఈ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇంత అద్భుతమైన చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన చేశారు. అలాగే అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేయగా.. జోర్డాన్, అల్జీరియాలోని సహారా ఎడారిల్లో సినిమా షూటింగ్ చేసుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టి ఎంతమేర కలెక్షన్లు సాదిస్తుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X