Prithviraj Sukumaran షూటింగులో గాయపడ్డ పృథ్వీరాజ్ సుకుమార్.. హాస్పిటల్‌లో చేరిక
మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ షూటింగులో తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీన్ షూటింగులో ఆయనకు బలమైన గాయం తగలడంతో స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. పృథ్వీరాజ్ సుకుమార్ ప్రమాదం జరిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఫ్యాన్స్ వాకబు చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పృథ్వీరాజ్ సుకుమార్ ప్రస్తుతం మలయాళ చిత్రం విలాయత్ బుద్ద షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్లు కొచ్చిన్‌కు సమీపంలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీన్ల షూట్ సందర్బంగా ఆయన మోకాలికి బలమైన గాయం జరిగింది. వెంటనే కొచ్చిన్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు.

మలయాళ మీడియా వెల్లడించిన ప్రకారం.. పృథ్వీరాజ్ సుకుమార్ గాయపడింది నిజమే. మోకాలికి బలమైన గాయం అయింది. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆయనకు సోమవారం ఉదయం మోకాలికి కీ హోల్ సర్జరీ జరుగుతుంది. కనీసం ఆయన రెండు నుంచి మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పారు.
పృథ్వీరాజ్ సుకుమార్ గాయపడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తిరిగి రావాలి. గాయం నుంచి త్వరగా కోలుకోవాలి అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ఆయనకు సందేశాలు అందిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు
పృథ్వీరాజ్ సుకుమార్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. 2022లో బ్రో డాడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత జన గణ మన, గోల్డ్, కాపా లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆడు జీవితం, విలాయత్ బుద్ద సినిమాలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











