వారికి నచ్చలేదా? ప్రియా వారియర్‌కు బూతు కామెంట్లతో టార్చర్!
'ప్రేమికుల రోజు' సందర్భంగా విడుదలైన 'ఓరు అడార్ లవ్' చిత్రంలోని ఓ పాటతో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్నెట్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆమె అందం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి చాలా మంది ఫిదా అయ్యారు. అప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో కూడా లేని ఆమె ఫాలోవర్స్.... ఇపుడు 4 మిలియన్ రీచ్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ సంచలనానికి ఇపుడు కొత్త చిక్కులు మొదలయ్యాయి.

అసభ్య కామెంట్లతో టార్చర్
సినిమా సెలబ్రిటీలకు అభిమానులు ఉన్నట్లే వారిని అసభ్య కామెంట్లతో టార్చర్ పెట్టే సైకోలు కూడా ఉంటారు. గతంలో ఇలాంటి సైకోల వల్గర్ కామెంట్ల వల్ల టార్చర్ అనుభవించిన తారలు అనేకం. తాజాగా ఈ పరిస్థితి ప్రియా ప్రకాష్ వారియర్‌కు కూడా ఎదురైంది.
Recommended Video


బూతులు, వల్గర్ కామెంట్స్
ఇటీవల ప్రియా వారియర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్టు చేయగా దానికి కొందరు యువకులు బూతు పదజాలం ఉపయోగిస్తూ అసభ్యకామెంట్స్ చేశారు. దీంతో ఆమె సన్నిహితులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

పోలీసు దర్యాప్తు
సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రియా వారియర్ మీద వల్గర్ కామెంట్స్ చేసి సంఘటపై దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

సుప్రీం కోర్టు వ్యవహారం
కాగా... తనపై నమోదైన ఓ కేసుకు సంబంధించి ప్రియా వారియర్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రియ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

స్టే కోరిన ప్రియా వారియర్
ఆమె నటించిన ఓరు అడార్ లవ్ చిత్రంలోని పాట ముస్లిం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ కొందరు ఆమెపై కేసు పెట్టడం, దీంతో తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ ప్రియా సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











