దర్శకుడికి ప్రియా వారియర్ అదిరిపోయే కౌంటర్.. నేను నిజాలు బయటపెడితే!

ప్రియా ప్రకాష్ వారియర్.. ఒకే ఒక్క కన్నుగీటిన వీడియోతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. దీనితో ప్రియవారియర్ నటించిన ఓరు ఆధార్ లవ్ చిత్రానికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం విడుదల కావడం, నిరాశపరచడం జరిగిపోయాయి. ఓరు ఆధార్ లవ్ చిత్రం ప్రియా వారియర్ కు ఎంతటి క్రేజ్ తీసుకుని వచ్చిందో.. అంతే స్థాయిలో విమర్శలని సైతం తెచ్చిపెట్టింది. ఇటీవల ఈ చిత్ర దర్శకుడు కూడా ప్రియవారియర్ ని విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ విమర్శలపై తాజాగా ప్రియా వారియర్ స్పందించింది.

మొత్తం మార్చేశారు

మొత్తం మార్చేశారు

ప్రియావారియర్ కన్నుగీటిన వీడియో విడుదల కాకముందు వరకు ఆమెది ఓరు ఆధార్ లవ్ చిత్రంలో హీరోయిన్ పాత్ర కాదు. ఈ చిత్రంలో అసలు హీరోయిన్ నూరిన్ షరీఫ్. కన్నుగీటిన వీడియోతో ప్రియా వారియర్ సెన్సేషన్ గా మారిపోయింది. దీనితో కథ మార్చి ప్రియా వారియర్ ని హీరోయిన్ గా చేయాలని నిర్మాతలు తనపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు దర్శకుడు ఒమర్ లులు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అందువల్లే పరాజయం

అందువల్లే పరాజయం

కథని మార్చడం, ప్రియా వారియర్ ని హీరోయిన్ గా చేయడం వల్లే ఒరు ఆధార్ లవ్ చిత్రం నిరాశపరిచిందని దర్శకుడు అభిప్రాయపడ్డాడు. ఇక నూరిన్ షరీఫ్ కూడా ప్రియా వారియర్ పై విమర్శలు గుప్పించింది. ప్రియా వారియర్ వల్ల తనకు దక్కాల్సిన పేరు దక్కలేదని నూరిన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ విమర్శలపై తాజగా ప్రియా వారియర్ స్పందించింది.

కర్మ సమాధానం చెబుతుంది

కర్మ సమాధానం చెబుతుంది

ప్రియా వారియర్ మాట్లాడుతూ.. అసలేం జరిగిందో బయటపెడితే కొందరి పేరు, ప్రఖ్యాతలు మంటగలసిపోతాయి. విమర్శలన్నింటికీ భవిషత్తులో కర్మ సమాధానం చెబుతుంది అని ప్రియా తెలిపింది. ఆ సమయం దగ్గర్లోనే ఉంది అని ప్రియా వారియర్ పరోక్షంగా దర్శకుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ప్రియా వారియర్ వల్ల ఈ చిత్రంలో తన పాత్రని తగ్గించారని నూరిన్ వాపోయిన సంగతి తెలిసిందే.

మాట్లాడడం లేదు

మాట్లాడడం లేదు

తాను ప్రస్తుతం ప్రియా వారియర్ తో మాట్లాడడం మానేశానని దర్శకుడు ఒమర్ లులు హాట్ కామెంట్స్ చేశారు. తాను ప్రియా వారియర్ తో భవిష్యత్తులో నటించనని నూరిన్ షరీఫ్ వ్యాఖ్యానించింది. ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్ కారణంగా ఒరు ఆధార్ లవ్ చిత్ర యూనిట్ లో మనస్పర్థలు ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X