అల్లు అర్జున్ అలా అనడంతో.... ఇంటర్నెట్ సంచలనం ప్రియా వారియర్ రియాక్షన్!

By Bojja Kumar

Recommended Video

Priya Warrior Expression Goes Viral, Star Heros 'Fidaa'

కంటిచూపుతో ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకు ఇంటర్నెట్ సంచలనం అయింది మలయాళ బ్యూటీ ప్రియా వారియర్. ఆమె చూపులకు మామూలు యువకులు మాత్రమే కాదు... మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నస్టార్లలో అల్లు అర్జున్ ఒకరు. అన్నట్లు ప్రియా వారియర్ కూడా బన్నీకి పెద్ద అభిమాని. తన అభిమాన హీరో నుండి తనకు కాపంప్లిమెంట్ రావడంతో ప్రియా వారియర్ పొంగిపోతోంది.

వారంతా ఒక వైపు... బన్నీ ఒక వైపు అనేసిన ప్రియా

వారంతా ఒక వైపు... బన్నీ ఒక వైపు అనేసిన ప్రియా

తన వీడియోకు దేశ వ్యాప్తంగా రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని, అభిమానులు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా..... తనకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంటే ఎంతో ప్రత్యేకమని ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రియా వారియర్ తెలిపారు.

బన్నీకి అభిమానిని

బన్నీకి అభిమానిని

అల్లు అర్జున్‌కు తాను పెద్ద అభిమానిని అని... మలయాళంలో విడుదలైన ఆయన అన్ని సినిమాలు చూశాను అని ప్రియా వారియర్ తెలిపారు. తాను అభిమానించే స్టార్ నుండి కాంప్లిమెంట్ రావడం సంతోషంగా ఉంది అంటోంది మలయాళి పిల్ల.

ఇంతకీ అల్లు అర్జున్ ఏమన్నాడు?

ఇంతకీ అల్లు అర్జున్ ఏమన్నాడు?

ప్రియా వారియర్ కన్నుగీటే వీడియో చూసిన అనంతరం అల్లు అర్జున్ స్పందిస్తూ... ‘ఇప్పటివరకు నేను చూసిన క్యూట్‌ వీడియోల్లో ఇది ఒకటి. పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ. లవ్‌ ఇట్‌' అంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

సినిమాకు ఫుల్ పబ్లిసిటీ

సినిమాకు ఫుల్ పబ్లిసిటీ

ఇంటర్నెట్లో సంచలనం అయిన ప్రియా వారియర్ వీడియో ఆమె నటిస్తున్న ‘ఓరు అడార్ లవ్' చిత్రంలోనిది. ఈ వీడియో పుణ్యమా అని ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.

‘ఓరు అడార్ లవ్’ టీజర్ బంపర్ హిట్

‘ఓరు అడార్ లవ్’ టీజర్ బంపర్ హిట్

‘ఓరు అడార్ లవ్' టీజర్ వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ ఇంటర్నెట్లో సంచలనం అయింది. ఇప్పటి వరకు దీనికి 12 మిలియన్ హిట్స్ వచ్చాయి. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రియుడి పాత్రలో రోషన్ అబ్దుల్ రవూఫ్ టిస్తున్నారు. ఓమర్ లులు దర్శకత్వం వహిస్తున్నారు.

మార్చి 1న సినిమా రిలీజ్

‘ఓరు అడార్ లవ్' లవ్ చిత్రం మార్చి 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రియా వారియర్ అందానికి దేశం మొత్తం ఫిదా అవ్వడంతో ఈ మలయాళ చిత్రం కేరళలో హిట్టయితే..... ఇతర భాషల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X