ప్రియా వారియర్ చిన్ననాటి ఫోటో... ఎంత ముద్దుగా ఉందో!

By Bojja Kumar

ఒకే ఒక్క వీడియోతో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. తొలి సినిమా ఇంకా విడుదల కాకముందే ఎవరూ ఊహించని విధంగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కోట్లలో ఉంది. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్ననాటి ఫోటో పోస్టు చేసింది.

ప్రియా ప్రకాష్ వారియర్ అభిమానులు ఇప్పటి వరకు చూడని ఒక అరుదైన ఫోటో కావడంతో ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని గంటల్లోనే లక్షలాది లైక్స్, షేర్లు, కామెంట్లతో ఈ పిక్ వైరల్ అయిపోయింది. ఇన్‌స్టాలో ప్రియా వారియర్‌కు 6 మిలియన్లకు పైగా పాలోవర్స్ ఉన్నారు.

సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన తొలి చిత్రం 'ఓరు అడార్ లవ్' సెప్టెంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా కొన్ని వివాదాల కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.

Priya Varriers rare childhood pic

ఓరు అడార్ లవ్' చిత్రానికి ఉమర్ లులు దర్శకత్వం వహించారు. ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్, సియద్ షాజహాన్, నూరిన్ షరీఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత ప్రియా వారియర్‌‍‌కు మరిన్ని అవకాశాలు ఖాయంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X