కోటి రూపాయలు కొట్టేసిన ప్రియా వారియర్.. షాక్‌లో మలయాళ ఇండస్ట్రీ!

By Rajababu

Recommended Video

Priya Prakash Varrier Was Paid With High Remuneration

ఒక్కసారి కన్నుగీటి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ వ్యాపార ప్రకటనల రంగంలో కూడా కుమ్మేస్తున్నది. ఒకే చిత్రంలో నటించిన ఈ అందాల భామ భారీ రెమ్యునరేషన్ కొట్టేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల ఓ వ్యాపార ప్రకటనలో నటించి ఊహించని విధంగా పారితోషికాన్ని సొంతం చేసుకొన్నది. వివరాల్లోకి వెళితే..

 వ్యాపార ప్రకటనలో ప్రియా వారియర్

వ్యాపార ప్రకటనలో ప్రియా వారియర్

శుక్రవారం (జూలై 6)న ఓ యాడ్ ఫిలిం షూట్ చేశాం. ప్రముఖ కంపెనీ కోసం యాడ్‌ను రూపొందించాం. ఇందులో ఓరు ఆధార్ లవ్ ఫేం ప్రియా వారియర్ నటించారు. ఆమెకు పారితోషికంగా రూ.1 కోటి చెల్లించాం. కొత్తగా వినోద పరిశ్రమలోకి వచ్చిన వారికి కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువ అని సదరు కంపెనీ వెల్లడించింది.

ప్రియాకు కోటి రూపాయలు

ప్రియాకు కోటి రూపాయలు

ఇటీవల కాలంలో వ్యాపార ప్రకటనల ప్రమోషన్ చేసినందుకు ప్రియా వారియర్ రూ.7.5 లక్షల తీసుకునేదట. అయితే ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో ఎదుగుతున్న ప్రియాకు ఓ కంపెనీ కోటి రూపాయలు ఇవ్వడం మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది.

రణ్‌వీర్ సరసన ప్రియా

రణ్‌వీర్ సరసన ప్రియా

ఓరు ఆధార్ లవ్ చిత్రంతో జాతీయ స్థాయిలో సెన్సేషన్‌గా మారిన ప్రియా వారియర్ ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించే సింహా చిత్రంలో రణ్‌వీర్ సింగ్ సరసన నటిస్తున్నది. త్వరలోనే బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలుపనున్నారనే వార్త ప్రచారంలో ఉంది.

ప్రియా వారియర్ వీడియోకు రికార్డు వ్యూస్

ప్రియా వారియర్ వీడియోకు రికార్డు వ్యూస్

ఓరు ఆధార్ లవ్ చిత్రంలో మాణిక్య మలరాయ పూవీ పాటలో కన్నుగీటి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది ప్రియా వారియర్. ఆ వీడియోకు యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రోషన్ అబ్దుల్ రావూఫ్, ప్రియా మధ్య కెమిస్ట్రీ కుర్రకారును ఊపేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X