టొరెంటోలో పాకా మూవీ.. మల్లేశం టీమ్ అండగా.. నిర్మాతగా రాజ్ రాచకొండకు అరుదైన గుర్తింపు
మలయాళ చిత్రం పాకా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకొన్నది. తొలిసారి దర్శకత్వం వహిస్తూ నితిన్ లుకోస్ రూపొందించిన పాకా చిత్రం 2021 టొరొంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శనకు ఎంపికైంది. దర్శకుడు నితిన్ లుకోస్ గతంలో భారీగా ప్రశంసలు, అవార్డులు అందుకొన్న మల్లేశం సినిమాకు సౌండ్ డిజైనర్‌గా పనిచేశారు.
ఇక మలయాళంలో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న పాకా చిత్రానికి మల్లేశం చిత్రాన్ని నిర్మించిన రాజ్ రాచకొండ నిర్మాత కావడం విశేషం. పాకా చిత్రం టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో డిస్కవర్ సెక్షన్ విభాగంలో ప్రదర్శించనున్నారు. ఇంగ్లీష్‌లో ఈ చిత్రానికి రివర్ ఆఫ్ బ్లడ్‌గా టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా నిర్మాతగా మారారు.

పాకా చిత్రంలో బాసిల్ పౌలోస్, వినితా కోషి, జోస్ కిజాక్కన్, అతుల్ జాన్, నితిన్ జార్జి, జోసెఫ్ మణికల్ నటించారు. శ్రీకాంత్ కాబోతు సినిమాటోగ్రఫి అందించగా, అరునిమా శంకర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఫైజల్ ఆహ్మద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
నితిన్ లుకోస్ కెరీర్ విషయానికి వస్తే.. తిథి, సందీప్ ఔర్ పింకీ ఫరార్‌తోపాటు మల్లేశం సినిమాకు సౌండ్ డిజైనర్‌గా పనిచేశారు. టొరెంటో ఫిలిం ఫెస్టివల్ సెప్టెంబర్ 9 నుంచి 18 వరకు జరుగుతుంది. ఈ వేడుకల్లో ప్రీమియర్లను డిజిటల్‌గా, థియేటర్లలోను ప్రదర్శించనున్నారు.


Click it and Unblock the Notifications











