కంటెస్టెంట్ కళ్లలో పచ్చికారం ముద్ద.. బిగ్‌బాస్‌‌ను అవుట్.. సెలబ్రిటీ అరెస్ట్‌?

మలయాళంలో కొనసాగుతున్న బిగ్‌బాస్ సీజన్ 2లో మంగళవారం దారుణమైన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. హౌస్‌లో హాట్ ఫేవరేట్‌గా ఉన్న రంజిత్ కుమార్ తోటి కంటెస్టెంట్లపై దారుణంగా వ్యవహరించారు. ఇంటిలో రంజిత్ అత్యుత్సాహం బిగ్‌బాస్ షోకు మచ్చగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లో చోటుచేసుకొన్న సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎంతకు రంజిత్ చేసిన నిర్వాకం ఏమిటంటే...

వివాదాలతో 66వ ఎపిసోడ్‌ వరకు

వివాదాలతో 66వ ఎపిసోడ్‌ వరకు

మలయాళ బిగ్‌బాస్ షోలో వివాదాలతోపాటు పలు రకాల టాస్క్‌లతో జోష్‌గా సాగుతున్నది. అయితే 66వ ఎపిసోడ్‌లో స్కూల్ స్టూడెంట్స్, టీచర్ అనే టాస్క్‌ను సెలబ్రిటీలకు ఇచ్చారు. ఈ టాస్క్‌లో ఆర్య, దయా, సుజో, ఫుక్రు టీచర్లుగా, రంజిత్ ఇతరులకు అల్లరి పిల్లలుగా నటించే టాస్క్‌ను కేటాయించారు.

రేష్మ కళ్లలో పచ్చికారం ముద్ద

రేష్మ కళ్లలో పచ్చికారం ముద్ద

టీచర్, స్టూడెంట్ టాస్క్ జరుగుతుండగా.. రేష్మ అనే కంటెస్టెంట్ జన్మదినం కావడంతో ఆమెకు విషెస్ తెలియచేశారు. బర్త్ డే సందర్భంగా చిన్నపాటి వేడుకల జరుగుతుండగా.. రంజిత్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వెళ్లి రేష్మ కళ్లలో పచ్చికారం ముద్దను రాశాడు. దాంతో మంటలు పుట్టడంతో రేష్మా భోరున విలపించింది.

పరిస్థితి దారుణంగా మారడంతో

పరిస్థితి దారుణంగా మారడంతో

అయితే టాస్క్‌లో భాగంగా రేష్మ నటిస్తుందనుకొని ఆమెను ఎవరూ పెద్దగా పటించుకోలేదు. కానీ పరిస్థితి దారుణంగా మారడంతో తోటి కంటెస్టెంట్లు అసలు విషయాన్ని గ్రహించారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ పరిస్థితుల్లో రంజిత్ తాను చేసిన తప్పును తెలుసుకొని తీవ్ర విచారం వ్యక్తం చేసినా లాభం లేకపోయింది.

బిగ్‌బాస్ హౌస్ నుంచి బహిష్కరణ

బిగ్‌బాస్ హౌస్ నుంచి బహిష్కరణ

బిగ్‌బాస్ హౌస్‌లో రంజిత్ కుమార్ చేసిన చర్యపై తొటి కంటెస్టెంట్లతోపాటు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వెంటనే రంజిత్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించి హౌస్‌ను బయటకు వెళ్లమంటూ ఆయనపై తాత్కాలిక బహిష్కరణ వేటు విధించాడు. దాంతో ఈ షో మరోసారి వివాదంలో కూరుకుపోయింది.

ఇంట్లోకి వచ్చిన రేష్మ

ఇంట్లోకి వచ్చిన రేష్మ

కంట్లో కారం ముద్దతో బాధకు గురైన రేష్మకు హస్పిటల్లో చికిత్స నిర్వహించారు. కార్నియ సంబంధిత చికిత్స నిర్వహించారు. అయితే కంటి సంబంధింత బాధ నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. చికిత్స అనంతరం రేష్మ తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరుకోగానే తోటి కంటెస్టెంట్లు ఓదార్పు ప్రకటించారు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 78 Highlights...! | Filmibeat Telugu
రంజిత్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..

రంజిత్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..

బిగ్‌బాస్ ఇంటిలో జరిగిన దారుణంపై రంజిత్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద ఆయనను అరెస్ట్ చేసేందుకు కేరళ పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రంజిత్ కుమార్‌పై సెక్షన్ 324, 323, 325 కింద కేసు నమదు చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ షోలో ఏం జరుగుతుందనే విషయం మరింత ఆసక్తిగా మారింది.

రంజిత్ కుమార్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన ప్రజా వక్త, లెక్చరర్, విద్యావేత్త, సామాజిక కార్యకర్త. శ్రీ శంకర కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ రంజిత్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంటారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటిలో సేవలందిస్తుంటారు. ఇలాంటి గొప్ప వ్యక్తి పాపులారిటీ కోసం ఇలాంటి చిల్లర పనులకు పాల్పడటం ఏమిటని ప్రేక్షకుల భగ్గుమంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X