యువ హీరోయిన్‌పై నిర్మాత రేప్.. ఆఫర్ ఇస్తానని పిలిచి.. కోరిక తీర్చమన్నాడు!
మలయాళ చిత్ర నిర్మాత వైశాక్ రాజన్ అత్యాచార కేసు నమోదైంది. ఓ వర్ధమాన నటి, మోడల్ ఫిర్యాదుతో ఉత్తర ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ ప్రారంభించగా.. నిందితుడు వైశాక్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాధితురాలు ఎవరనే విషయాన్ని పోలీసులు, మీడియా గోప్యంగా ఉంచింది. వివరాల్లోకి వెళితే..

వైశాక్ రాజన్‌పై కేసు నమోదు
మోడల్ ఫిర్యాదు చేయడంతో నిర్మాత వైశాక్ రాజన్‌పై కేసు నమోదైంది. ఆయనపై సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేశాం. దర్యాప్తు కొనసాగుతుంది అని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అయితే ఈ కేసు వివరాలు మరిన్నీ తెలియాల్సి ఉంది. అలాగే ఈ కేసు 2017కు సంబంధించి కావడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎర్నాకులం అపార్ట్‌మెంట్‌లోని
మీడియా కథనాల ప్రకారం.. సినిమాలో ఆఫర్ ఇస్తానని ఎర్నాకులంలోని కథిరికడవులోని అపార్ట్‌మెంట్‌కు పిలిచాడు. తన కోరిక తీర్చమని బలవంతంగా చేయగా అందుకు అంగీకరించలేదు. దాంతో మోడల్‌పై నిర్మాత వైశాక్ అత్యాచారం జరిపాడు అని పేర్కొన్నాయి.

వైశాక్ రాజన్ చిత్రాలు ఇవే
గతంలో పద్మశ్రీ భరత్ డాక్టర్ సరోజ్ కుమార్, రోల్ మోడల్స్, వెల్‌కమ్ టు సెంట్రల్ జైల్ అనే చిత్రాలను వైశాక్ రూపొందించారు. వైశాక్ చివరిసారిగా జానీ జానీ ఎస్ అప్పా అనే చిత్రాన్ని రూపొందించారు. వైశాక్ రూపొందించిన వెలకమ్ టు సెంట్రల్ జైల్ చిత్రంలో ప్రముఖ నటుడు దిలీప్ నటించాడు. ఈయన కూడా లైంగిక వేధింపుల కేసులో జైలుపాలైన సంగతి తెలిసిందే.

వైశాక్ రాజన్ ఫేస్‌బుక్‌లో
కాగా, వైశాక్ రాజన్ సినీ నిర్మాణ సంస్థ వైశాక్ సినిమా తన ఫేస్‌బుక్ అకౌంట్లో ఓ మెసేజ్ పెట్టారు. ఇటీవల వరదల్లో ఇంటిని కోల్పోయిన చెంగన్నూర్ నివాసికి వైశాక్ ఇంటిని నిర్మించడానికి ముందుకొచ్చాడు అని పేర్కొన్నాడు. అయితే వైశాక్ అలాంటి వాడు కాదని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











