సైలెంట్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న హీరో.. ఆపై గుడిలోనే అలాంటి పనులు చేస్తూ వీడియో పోస్ట్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య డివొర్స్ కన్నా ఎక్కువగా పెళ్లిల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చిన్న చిన్న నటుల నుంచి స్టార్ యాక్టర్స్ వరకు చాలా మంది వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే దర్శకుడు శంకర్ కూతురు నిశ్చితార్థం, సీనియర్ నటుడు విజయ్ కుమార్ మనవరాలి పెళ్లి, టాలీవుడ్ హీరోయిన్ దివ్య.. ఇలా వరుసగా అందరూ పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా మరో హీరో కూడా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సైలెంట్‌గా గుడిలో పెళ్లి చేసుకుని, ఆపై గుడిలోనే అలాంటి వీడియోను పోస్ట్ చేసి ప్రేక్షకులకు, అభిమానులకు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది దాని గురించే ఈ కథనం...
ప్రముఖ నటుడు సుదేవ్ నాయర్ ఈ పేరు చెప్పగానే ఎవరో గుర్తుపట్టకపోవచ్చు. ఆయన మలయాళంలోని పలు చిత్రాల్లో హీరోగా నటించారు. తెలుగులో మాస్ మహారాజా నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఎమ్మెల్యే బావమరిది కాశీ పాత్రలో నటించి మెప్పించారు. ఇక హీరో నితిన్ రీసెంట్ రిలీజ్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ చిత్రంలో నీరో అనే విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అయితే మరి ఈయన విలన్ కదా? హీరో అంటారు ఏంటి అని అనుకుంటారేమో. ఇక్కడ విలన్‌గా పరిచయమైన ఈయన మలయాళ భాషలోని పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. ఇతర హీరోల చిత్రాల్లో పలు కీలక పాత్రలు కూడా పోషించారు.

ఈయన తాజాగా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. తన ప్రేయసి, మోడల్ అమర్‌దీప్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. సుదీప్, అమర్‌దీప్‌లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా గురువాయూర్‌లో గుడిలో వీరి వివాహాం జరిగింది. దగ్గరి బంధువులు, స్నేహితులు సమక్షంలో ఈ వివాహ వేడుక సింపుల్‌గా జరిగింది. కాగా, అమర్‌దీప్ కౌర్ 1992లో గుజరాత్‌లో జన్మించారు. ఈమె ఓ ఫేమస్ మోడల్. అనేక అందాల పోటీలలో విజేతగా కూడా నిలిచింది. తాజాగా పెళ్లి చేసుకున్న వీడియో వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుడిలో పెళ్లి చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఇక ఆ వీడియో చివర్లో నూతన వధూవరులిద్దరూ సరదాగా నవ్వుతూ చిన్నగా డ్యాన్స్ వేస్తూ కనిపించి ఆకట్టుకున్నారు.

ఇకపోతే సౌమిక్ సేన్ డైరెక్ట్ చేసిన హిందీ చిత్రం గులాబ్ గ్యాంగ్ (2014)తో వెండితెర అరంగేట్రం చేశారు సుదేవ్ నాయర్. ఆ తర్వాత మై లైఫ్ పార్టనర్, కరీంగున్నం సిక్సెస్, అనార్కలి, కాయంకుళం కొచ్చున్ని, ఎజ్రా, మైఖేల్, అబ్రహం సన్స్, మామాంగం, అతిరన్, భీష్మపర్వం, వన్, నైన్టీన్ సెంచరీ, తురముగం వంటి చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నీ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉత్తమ నటుడిగా రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారు.
సుదేవ్ నాయర్ పాలక్కాడ్ వాసులు విజయకుమార్ - శుభద దంపతులకు జన్మించారు. ముంబయిలో పుట్టి పెరిగారు. సినిమాల మీద ఆసక్తితో ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేశారు. పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి యాక్టింగ్ కోర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. అలాగే బ్రేక్ డ్యాన్స్, బాక్సింగ్, పార్కర్, జూడో, కరాటే, కలరీ పాయట్ వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకున్నారు. 2001 అండర్-16 నేషనల్ గేమ్స్ హైజంప్‌లో బ్రాంజ్ మెడల్‌ను సంపాదించుకున్నారు.


Click it and Unblock the Notifications











