అత్యంత విషమంగా స్టార్ డైరెక్టర్ ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై చికిత్స
ప్రఖ్యాత మలయాళ సినీ దర్శకుడు షఫీ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. అంతర్గత రక్తస్రావం సహా పలు అనారోగ్య సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం షఫీకి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు మరో దర్శకుడు బీ ఉన్నికృష్ణన్ వెల్లడించారు. షఫీ ఆరోగ్యం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
కొచ్చిలోని అస్టర్ మెడ్‌సిటీలో షఫీకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం షఫీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దే ఉన్నట్లు ఉన్నికృష్ణన్ మీడియాకు తెలియజేశారు. ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఉన్నికృష్ణన్ తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని.. ఎంత ఖర్చయినా అత్యునత వైద్యం అందించాలని తాము డాక్టర్లను కోరామని ఆయన వెల్లడించారు. డైరెక్టర్ షఫీ అనారోగ్య సమస్యలతో జనవరి 16న కొచ్చిలోని అస్టర్ మెడ్‌సిటీ ఆసుపత్రిలో చేరారు. దీంతో వైద్యులు అప్పటికప్పుడే ఆయనకు బ్రెయిన్ సర్జరీ చేసి నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

18 ఫిబ్రవరి 1968న కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో జన్మించారు షఫీ. ఆయన అసలు పేరు రషీద్ ఎంహెచ్. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి చేసిన తర్వాత సినీ రంగం వైపు వెళ్లారు షఫీ. 1995లో జయరామ్ హీరోగా వచ్చిన ఆద్యతే కన్మణి సినిమాకు రాజసేనన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా రఫీ కెరీర్ ప్రారంభించారు. తర్వాత రఫీ మెకార్టిన్, సిద్ధిఖ్ వంటి దర్శకుల దగ్గర పనిచేశారు రఫీ.
2001లో జయరామ్ హీరోగా వచ్చిన వన్ మేన్ షో సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు షఫీ. 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో కళ్యాణ్ రామన్, పులివల్ కళ్యాణం, తోమ్మానుమ్ మక్కలుమ్, మజా, మాయావి, చాక్లెట్, లాలీపాప్, చట్టాంబినాదు, మేకప్‌మెన్, 101 వెడ్డింగ్స్, టూ కంట్రీస్, షెర్లాక్ టామ్స్, ఓరు పజాయ బాంబ్ కథ, చిల్డ్రన్స్ పార్క్ వంటి సినిమాలు తీశారు. చివరిసారిగా 2022లో ఆనందం పరమానందం సినిమాకు షఫీ దర్శకుడిగా వ్యవహరించారు.
యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి మలయాళ చిత్ర పరిశ్రమలో కామెడీ చిత్రాలతో తనదైన మార్క్ చూపించడంతో పాటు కాసుల వర్షం కురిపించారు షఫీ. విక్రమ్, మమ్ముట్టి, జయరామ్, దిలీప్, పృథ్వీరాజ్ సుకుమారన్, కంచుకో బోబన్, విష్ణు ఉన్నికృష్ణన్ వంటి స్టార్ హీరోలను ఆయన డైరెక్ట్ చేశారు. షఫీ తీసిన సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయి అక్కడా ఘన విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో షఫీ అనారోగ్యం బారినపడటంతో మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కోలుకుని తిరిగి మామూలు మనిషి కావాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications











