twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొడలు చూపిస్తే అభ్యంతరమా? సెన్సార్‌ బోర్డు తీరుపై హీరోయిన్ ఆగ్రహం

    By Rajababu
    |

    సెన్సార్ బోర్డు తీరుపై ఇటీవల కాలంలో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సెన్సార్ బోర్డు అధికారుల ప్రవర్తనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఉడ్తా పంజాబ్, పద్మావతి, సెక్సీ దుర్గ లాంటి చిత్రాల విషయంలో సెన్సార్ బోర్డు అనేక విమర్శలు ఎదుర్కొన్నది. తాజాగా మలయాళ చిత్రం అభాషం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడం వివాదంగా మారింది. అధికారులు తీరుపై రిమా కల్లింగల్ తీవ్రంగా స్పందించారు.

    Recommended Video

    సినీ పరిశ్రమలో సెక్సిజం.. నోరువిప్పిన హీరోయిన్!
     సెన్సార్ బోర్డుపై రీమా గరం

    సెన్సార్ బోర్డుపై రీమా గరం

    సెంట్రల్ బోర్డు ఆఫ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నిబంధనలు ఉల్లంఘిస్తే సాధారణంగా ఏ సినిమాకైనా సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరిస్తారు. కానీ ఇటీవల కాలంలో ఇతరత్రా కారణాల వల్ల సినిమాలకు సర్టిఫికెషన్ నిరాకరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశం అనే చెప్పుకోనే ఇక్కడ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం శోఛనీయం.

     అతడు తొడలు చూపిస్తే అభ్యంతరమా?

    అతడు తొడలు చూపిస్తే అభ్యంతరమా?

    అభాషం సినిమాలో నటుడు సురజెట్టన్ తొడలు చూపించడంపై సెన్సార్ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఆయన తొడలు చూపించడం సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధం అని అన్నారు. అదే సురజెట్టన్ పులిమురుగన్ చిత్రంలో తొడలు చూపిస్తే అభ్యంతరం చెప్పలేదు.

    సెన్సార్ హిపోక్రసికి నిదర్శనం

    సెన్సార్ హిపోక్రసికి నిదర్శనం

    ఇలా ఒక్కో సినిమాకు ఒక్కో రకంగా సెన్సార్ వ్యవహరించడం, నిబంధనలు మార్చడం వారి ద్వంద ప్రమాణాలకు నిదర్శనం. అది వారి హిపోక్రసీకి అద్దం పడతున్నది. ఓ సమాజంలో జరిగిన ఘటనను తన కళ ద్వారా చెప్పలేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో జీవించి ఉండటం ఎందుకు అని రీమా కల్లింగల్ ప్రశ్నించారు.

    ఇది కుటుంబ కథా చిత్రం

    ఇది కుటుంబ కథా చిత్రం

    నిబంధనల పేరుతో సెన్సార్ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. అభాషం సినిమాలో హింస లేదు, అశ్లీల సన్నివేశాలు లేవు. కానీ ఆ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అభాషం చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చే చిత్రం. కానీ సెన్సార్ ఆలోచనాధోరణిలో సరిగా లేకపోవడం అనేక సమస్యలు తలెత్తుతున్నాయి అని రీమా పేర్కొన్నారు.

     నటీనటులు, దర్శకుడు వీరే

    నటీనటులు, దర్శకుడు వీరే

    అభాషం చిత్రానికి జుబిత్ నమ్రదథు తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో సురజ్ వెంజరమూడు, అలెన్సీయర్ లే లోపేజ్, రీమా కళింగల్ తదితరులు నటించారు. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానున్నది.

    English summary
    Actor Rima Kallingal’s Abhasam is set to release on May 4. The film had to face the wrath of the Censor Board. The censor board initially said that they had a problem with Surajettan exposing his thigh. When I told this to one of my friends she said, ‘So was it ok to flash thighs in Pulimurugan’. It was then the hypocrisy struck me".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X