ఇండస్ట్రీలో అలాంటి నీచులు ఇంకా ఉన్నారు, మరో నటికి షాకింగ్ అనుభవం!
ఓ వైపు #మీటూ ఉద్యమాలు, మరో వైపు కాస్టింగ్ కౌచ్ లాంటి వ్యవహారాలపై ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ... సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. లైంగిక కోరికలు తీరిస్తేనే సినిమా అవకాశం ఇస్తామనే నీచ సంస్కృతి కొన్ని చోట్ల అలాగే ఉంది.
ప్రముఖ మలయాళ నటి సాజితా మడతిల్‌కు తాజాగా అలాంటి షాకింగ్ అనుభవం ఎందురైంది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడించారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఒకరు తనకు ఫోన్ చేసి కాంప్రమైజ్ అయితే సినిమా ఆఫర్ రెడీగా ఉంది అని చెప్పినట్లు తెలిపారు.

అసిస్టెంట్ డైరెక్టర్ కార్తీక్
తనకు కార్తిక్ అనే వ్యక్తి ఫోన్ చేశాడని, తమిళ సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడని, తప్పుడుగా ప్రవర్తించాడని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తనకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో కూడా వెల్లడించారు.

కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధమా?
‘‘సోమవారం అతడి నుంచి కాల్ వచ్చింది. నా సినిమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత నేను ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘మీరు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధమేనా' అని అడిగాడు. అతడు అలా అనగానే షాకయ్యాను'' అని సాజితా చెప్పుకొచ్చారు.
క్షమాపణలు చెప్పే ప్రయత్నం
నేను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదని తెలియడంతో వెంటనే క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేశాడు. మిస్టేక్ చేశానంటూ సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాయనే విషయం తెలిసి బాధేస్తోంది అని సాజితా చెప్పుకొచ్చారు.

సాజితా మడతిల్
సాజితా మడతిల్ 1980ల్లో థియేటర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. 1990ల్లో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఆమె 30కి పైగా చిత్రాల్లో నటించారు. ‘షట్టర్' చిత్రానికి గాను కేరళ స్టేట్ సెకండ్ బెస్ట్ యాక్టర్ అవార్డుతో పాటు పలు అవార్డులు గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications











