అసిస్టెంట్ డైరెక్టర్‌ని అంటూ నటికి ఫోన్.. ఏం జరిగిందో తెలుసా, పరువు తీసేలా!

చిత్ర పరిశ్రమలో నటీమణులని వేధింపులు ఎదురుకావడం ఆగడం లేదు. అవకాశాల పేరుతో కొందరు నటీమణులని లోబరుచుకునే సంఘటనలు జరుగుతున్నాయని గతంలో చాలా ఫిర్యాదులు నమోదయ్యాయి. మేనేజర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ల పేరుతో వర్తమాన హీరోయిన్లని మోసం చేసే సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తాను అసిస్టెంట్ డైరెక్టర్ ని అంటూ ఓ ఆకతాయి ప్రముఖ మలయాళీ నటి సాజిత మందతిల్ కు ఫోన్ చేశాడు. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు.సాజిత అతడికి సరైన విధంగా బుద్ది చెప్పింది.

విచిత్రమైన ప్రశ్నలతో

విచిత్రమైన ప్రశ్నలతో

మలయాళీ నటి సాజిత మందతిల్ బోల్డ్ పాత్రలు, రొమాంటిక్ సన్నివేశాలతో గుర్తింపు పొందింది. సాజిత బుల్లితెరపై కూడా నటిగా రాణిస్తోంది. సోమవారం రోజు గుర్తు తెలియని వ్యక్తి నుంచి సాజిత ఫోన్ కాల్ అందుకుందట. అతడి అసభ్యకర ప్రవర్తనని మొత్తం సాజిత సోషల్ మీడియాలో వెల్లడించింది. అతడు తనని విచిత్రమైన ప్రశ్నలతో వేధించడానికి ప్రయత్నించాడని సాజిత వెల్లడించింది.

 నీ వయసెంత

నీ వయసెంత

సాజిత మాట్లాడుతూ.. తనకు ఫోన్ చేసిన వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. నా పేరు కార్తీక్. మీ వయసెంత.. గతంలో ఎప్పుడైనా సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారా లాంటి వింత ప్రశ్నలు అడిగాడు. తమిళంలో ఓ చిత్రంలో కీలక పాత్ర ఉంది. ఆ సినిమా గురించి నేను ఇప్పుడే చెప్పను. మనం అంతా ఓకే అనుకున్న తర్వాత రివీల్ చేస్తా అని తెలిపాడు. వేరే చిత్ర పరిశ్రమ నుంచి ఆఫర్ కావడంతో.. అతడు నిజాయతీగా ఫోన్ చేశాడా లేదా అని నిర్దారించుకుంటే మంచిది అనిపించింది.

కాంప్రమైజ్ అవుతావా

కాంప్రమైజ్ అవుతావా

అతడి గురించి తీసుకునేందుకు అనేక ప్రశ్నలు అడిగాను. అసలు నిజం బయటపడుతున్న సమయంలో అతడే తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు.నీవు కాంప్రమైజ్ కావాలి.. సర్దుకుపోవాలి.. అప్పుడే నీకు మంచి అవకాశాలు వస్తాయి అని అసభ్యంగా సాజితతో మాట్లాడాడు. అతడి అడిగిన ప్రశ్నకు నేను షాక్ అయ్యా. గతంలో ఎవరూ నాతో ఇలా అసభ్యంగా ప్రవర్తించలేదు. సినిమా అవకాశం ఉందంటే కేవలం ఆ విషయాలు మాత్రమే మాట్లాడేవారు అని సాజిత తెలిపింది.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

అతడికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్న సాజిత అతడి నెంబర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కండిషన్స్ కు ఓకే అయితే ఇతడికి ఫోన్ చేసి సినిమా అవకాశం పొందండి అని సాజిత తెలిపింది. సాజిత బంధువు ఒకరు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని చెప్పడంతో అతడు భయపడిపోయాడు. సాజితని క్షమాపణ కోరేందుకు పలుమార్లు ఫోన్ చేశాడు. మెసేజ్ లు పెట్టాడు. కానీ తాను స్పందించలేదని సాజిత తెలిపింది. ఇలాంటి వారిని క్షమిస్తే తప్పుచేసినట్లు అవుతుంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు సాజిత తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X