ఆ హీరోయిన్‌కు గట్టి దెబ్బ కొట్టిన సమంత.. వేట మొదలు పెట్టిన బ్యూటీ!
సినిమా ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు జరగడం సాధారణమే. కానీ అలాంటి వార్తలకు ఎక్కువగా రీచ్ ఉంటుంది. ప్రతీ నిత్యం ఏదో రూపంలో మీడియాలో హెడ్‌లైన్స్‌ను హిట్ చేసే సమంత మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. నయనతార చేయాల్సిన రోల్‌ను ఆమె చేజిక్కించుకోవడం ఒక వార్త అయితే.. ఇప్పటి వరకు అడుగుపెట్టని ఓ ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు మరో స్పెషల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కెరీర్‌పరంగా జోరు మీద ఉన్న సమంతకు అరుదైన వ్యాధి మయోసైటిస్ బ్రేక్ వేసింది. గత రెండు మూడు ఏళ్లుగా సినిమాలను భారీగా తగ్గించింది. గతంలో ఒప్పుకొన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఓ దశలో ఇక సినిమాలను ఆమె చేస్తుందా? లేదా అనే అనుమానం క్రియేట్ అయింది. కానీ ఇప్పుడిప్పుడే సమంత సినిమాల వేట మొదలు పెట్టింది.

తాజాగా మలయాళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. దాదాపు దశాబ్ద కాలం కెరీర్‌లో ఇప్పటి వరకు ఆమె మాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. మలయాళంలో ఆమెకు ఇదే డైరెక్ట్ మూవీ అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే కాకుండా మమ్ముట్టితో కలిసి నటించడం కూడా ఇదే తొలిసారి అని మీడియా కథనాలు వెల్లడిస్తున్నది.
మలయాళంలో మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమా మొదలు కాబోతున్నది. ఈ సినిమాను జూన్ 15వ తేదీన సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్రిల్లర్‌గా రూపొందే ఈ సినిమా షూట్‌ను ఎక్కువ భాగం చెన్నైలో చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. ఒకట్రెండు రోజుల్లో ఈ సినిమా గురించి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు.

ఇక వాస్తవానికి, ఇంకా పేరు పెట్టని సినిమాలో ముందు నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలు, అలాగే ముందస్తు కమిట్‌మెంట్స్ వల్ల ఈ సినిమా నుంచి తప్పుకొన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ అవకాశాన్ని సమంత చేజిక్కించుకొన్నారు అని మాలీవుడ్ మీడియా కథనం వెల్లడించింది.
మమ్ముట్టి సినిమా నుంచి నయనతార తప్పుకోవడం వెనుక అనేక రూమర్లు, గాసిప్స్ వినబడుతున్నాయి. దర్శకుడు, హీరోతో ఉన్న వ్యక్తిగత విభేదాలు, పాత్ర పరంగా కొన్ని డిమాండ్స్ పెట్టడం వల్లే నయనతార ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా సమంతకు తొలిసారి మలయాళంలో ఎంట్రీ ఇచ్చే బంపర్ ఆఫర్ మాత్రం చేజిక్కింది.


Click it and Unblock the Notifications











