సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!
మలబారి మాండలికంలో పంచ్ లతో అలరించిన మలయాళ ప్రముఖ నటుడు మముక్కోయా కేరళ కోజికోడ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 450కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మముక్కోయా.రెండ్రోజుల క్రితం మలప్పురం జిల్లాలోని కాలికవులో ఓ ఫుట్ బాల్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మముక్కోయా.
టోర్నీ ప్రారంభానికి ముందే ఆయన కుప్పకూలారు. ట్రామా కేర్ వాలంటీర్లు ఆయనకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించే హుటాహుటినా వండూర్ లోని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి ఆయనను కోజికోడ్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెదడులో రక్తస్రావంతో పాటు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనకు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మముక్కోయా తుదిశ్వాస విడిచారు. మముక్కోయా మమ్ముట్టి, జయరామ్, మోహన్ లాల్ వంటి లెజెండరీ యాక్టర్స్ తో స్క్రీన్ పంచుకున్నారు.

1979లో థియేటర్ నాటకాల నుండి సినిమాల్లోకి వచ్చారు మముక్కోయా. మంచి కామెడీ టైమింగ్ తో ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకున్నారు. మలబార్ మాండలికంలో ఆయన పలికే సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి. అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చారు. 1990ల్లో విడుదలైన దాదాపు అన్ని హిట్ సినిమాల్లోనూ మముక్కోయా నటించారు. ఆ కాలంలో మముక్కోయా లేకుండా సినిమాలో దాదాపుగా రాలేదనే చెప్పాలి. ఆ కాలంలో ఓ వెలుగు వెలుగొందారు.
డైరెక్టర్ సత్యన్ అంతిక్కడ్ తో మముక్కోయాకు ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తీసిని గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, నాడోడికట్టు, సందేశం వంటి చిత్రాలకు పని చేశారు. నాడోడికట్టు మూవీలో హీరోను దుబాయ్ కు తీసుకెళ్తానని చెప్పి మోసగించే పాత్రలో కనిపించారు మముక్కోయా. ఇందులో ఆయన నటనకు, కామెడీ టైమింగ్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2008లో 'ఇన్నాతే చింతా విషయంలో మముక్కోయా షాజహాన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి గాను ఆయనకు ఉత్తమ హాస్య నటుడిగా కేరళ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది.


Click it and Unblock the Notifications











