ఆ శృంగారతార చనిపోయిందంటూ వదంతులు.. క్లారిటీ ఇచ్చిన షకీల!

Recommended Video

Shakeela Reveals That Secret Of Actress Reshma | Filmibeat Telugu

మలయాళీ చిత్ర పరిశ్రమ అంటే బిగ్రేడ్ చిత్రాలు కూడా గుర్తుకు వస్తాయి. మళయాలం నుంచి చాలా మంది శృంగార తారలు బి గ్రేడ్ చిత్రాలతో స్టార్స్ గా మారారు. అందులో మొదటగా వినిపించే పేరు షకీల. షకీలా 90 వ దశకంలో యువతని ఎంతలా వేడెక్కించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్రేడ్ చిత్రాలతో అదే సమయంలో షకీలాకు గట్టి పోటీ ఇచ్చిన నటి రేష్మ. దాదాపుగా షకీలా స్థాయిలో రేష్మ గుర్తింపు పొందింది. కానీ ఆమె చేసిన కొన్ని తప్పుల వలన అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది. షకీలా మాత్రం బిగ్రేడ్ చిత్రాలకే పరిమితం కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉండగా రేష్మ చనిపోయిందంటూ వస్తున్న వార్తలపై షకీల క్లారిటీ ఇచ్చింది.

వాళ్ళిద్దరి సినిమాలు విడుదలైతే

వాళ్ళిద్దరి సినిమాలు విడుదలైతే

మాలయంలో షకీల, రేష్మ సినిమాలు విడుదలతే బడా హీరోలైన మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలు ఉండే థియేటర్స్ కూడా వెలవెల బోయేవి. మలయాళీ చిత్ర పరిశ్రమకు వీరి చిత్రాలు ప్రమాదకరంగా మారుతుండడం, సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధం అని వ్యతిరేకత రావడంతో కేరళ ప్రభుత్వం అప్పట్లో బిగ్రేడ్ చిత్రాలపై నిషేధం విధించింది. దీనితో ఆ సమయంలో షకీలా, రేష్మ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

భారీ పారితోషికం

భారీ పారితోషికం

ఓ దశలో రేష్మ తన చిత్రాలకు గాను షకీలని సైతం అధికమించి 5 లక్షల పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్న రేష్మ కెరీర్ అవకాశాలు రాకపోవడంతో చాలా తీవ్రమైన పరిస్థితులని ఎదుర్కొంది. షకీలాకు మాత్రం తమిళంలో, తెలుగులో అవకాశాలు వచ్చాయి. రేష్మ వ్యభిచారం కేసుల్లో చిక్కుకోవడంతో ఆమె కెరీర్ మరింత అధికారంగా మారింది. 2007లో సెక్స్ రాకెట్ లో చిక్కుకుని బెయిల్ పై విడుదలయింది. ఆ తర్వాత ఆమె మళ్లీ కనిపించలేదు.

చనిపోయిందంటూ

చనిపోయిందంటూ

ఇటీవల రేష్మ మరణించిందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి కొందరు రేష్మ విదేశాలకు వెళ్లిందని అంటున్నారు. ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలా క్లారిటీ ఇచ్చింది. తన సహచర నటి మరణించిందనే వార్తలపై స్పందించింది. రేష్మ చనిపోలేదు. పెళ్లి చేసుకుని మైసూర్ లో భర్తతో సంతోషంగా జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని షకీలా క్లారిటీ ఇచ్చింది. రేష్మ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని షకీలా తెలిపింది.

షకీలా బయోపిక్

షకీలా బయోపిక్

ప్రస్తుతం షకీలా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రేష్మ పాత్ర కూడా ఉంటుందా అనే చర్చ మొదలైన నేపథ్యంలో, ఆమె చనిపోయిందంటూ కూడా పుకార్లు మొదలయ్యాయి. షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. ఇంద్రజిత్ లంకేశ్ ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X