Poorna Marriage: పూర్ణ భర్త ఎవరు? ఆయన బిజినెస్ ఏంటి? హడావిడిగా పెళ్లి కారణం ఏమిటంటే?
దక్షిణాదిలో నటిగా, డ్యాన్సర్‌గా, మోడల్‌గా రాణిస్తున్న హీరోయిన్ పూర్ణ (మలయాళంలో షామ్నా ఖాసీం) తెలుగు చిత్రసీమలో విశేషంగా అభిమానులు ఉన్నారు. సినిమాలు, బుల్లితెరపై విశేషంగా రాణిస్తున్నారు. మాతృభాష మలయాళంలో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన పూర్ణ ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మి చిత్రం ద్వారా తెలుగులోకి ప్రవేశించారు. ఈ ముద్దుగుమ్మ వివాహం ఇటీవల కేరళలోని మాలప్పురంలో నిరాడంబరంగా జరిగింది. తన పెళ్లి గురించిన విశేషాలను తెలియజేస్తూ..

నా భర్త పేరు ఏమిటంటే?
నా భర్త పేరు షానిద్ ఆసీఫ్ ఆలీ. చాల సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కెరీర్ పరంగా బిజీగా ఉండటం వల్ల మేమిద్దరం నిర్ణయం తీసుకోలేకపోయాం. కొద్దికాలంగా మా మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది. నా హృదయానికి దగ్గరైన వ్యక్తి ఆయన. మా పెళ్లికి ఇరు కుటుంబాలు సమ్మతం తెలియజేయడంతో మేమిద్దరం ఒక్కటయ్యాం. మా సుదీర్ఘమైన ప్రేమాయాణానికి అలా ముగింపు పడింది అని నటి పూర్ణ తెలిపారు.

దుబాయ్ కంపెనీలో సీఈవోగా
నా భర్త షానిద్ ఆసీఫ్ ఆలీ దుబాయ్‌లో స్థిరపడ్డారు. జేబీఎస్ గ్రూప్ కంపెనీలో సీఈవోగా పనిచేస్తున్నారు. మా కుటుంబంలోని అందరికి షానిద్ నచ్చడంతో మా పెళ్లికి మార్గం సుగమమైంది. ఇంత త్వరగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగి నేను సెటిల్ అవుతానని ఊహించలేదు. నా కోసం చాలా మంది అబ్బాయిలను నా ఫ్యామిలీ చూసింది. కానీ నా మనసులోని వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నా కుటుంబాన్ని ఒప్పించాను అని పూర్ణ తెలిపింది.

దుబాయ్ నుంచి గోల్డెన్ వీసా
దుబాయ్‌కి వెళ్లడానికి గోల్డెన్ వీసాకు అప్లై చేసుకోవడం వల్ల మా మధ్య ఫోన్‌లోనే భారీగా సంభాషణ జరిగేది. నాకు గోల్డెన్ వీసాను అక్కడి ప్రభుత్వం త్వరగానే ఇచ్చింది. నాకు గోల్డెన్ వీసా ఇచ్చిన తర్వాత కూడా సినిమా షూటింగుల కారణంగా నేను తీసుకోలేకపోయాను. మా పెళ్లికి ముందు దుబాయ్‌లో సంప్రదాయంగా నిర్వహించిన పెళ్లి చూపుల్లాంటి మర్హాబా కార్యక్రమంలో నేను షానిద్‌ను తొలిసారి కలుసుకొన్నాను అని పూర్ణ వెల్లడించింది.

దుబాయ్‌లో పెళ్లి వేడుక..
దుబాయ్‌లో జరిగిన మర్హాబా కార్యక్రమంలో మా ఫ్యామిలీ అభిప్రాయాలు, ఆయన ఫ్యామిలీ అభిప్రాయాలు కలిశాయి. దాంతో ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సవ్యంగా జరిగిపోయాయి. భగవంతుడి దయ, ఆశీర్వాదం వల్ల అన్ని పాజిటివ్‌గా జరిగిపోయాయి. ఓ వేడుకలో ఇక్కా (షానిద్) ప్రపోజల్‌ను అఫీషియల్‌గా అంగీకరించాను. ఒక నెల రోజుల్లోనే అన్నీ చకచకా జరిగిపోయాయి అని పూర్ణ తెలిపింది.

కేరళలో కొన్ని పెళ్లి వేడుకలు
షానిద్ నాకు నిఖా ఫంక్షన్ కన్నూరులో జరిగింది. పెళ్లికి సంబంధించిన ఇంకా కార్యక్రమాలు జరుగాల్సి ఉంది. ఈ నెల చివరి భాగంలో పెళ్లి వేడుకలు జరుగుతాయి. నా పెళ్లి గురించి మా అమ్మకు బెంగ ఉండేది. మేము మొత్తం ఐదుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఒక అన్నయ్య ఉన్నాడు. మా ఇంట్లో నా సిస్టర్స్, బ్రదర్స్‌కి పెళ్లిళ్లు జరిగిపోయాయి అని పూర్ణ తెలిపింది.


Click it and Unblock the Notifications











