విషాదం: ప్రముఖ సింగర్ భార్య మరణం, ఏం జరిగిందంటే...
ప్రముఖ మలయాళం సింగర్ బిజు నారాయణ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య శ్రీలత మంగళవారం కన్నుమూశారు. మలయాళం మీడియా కథనాల ప్రకారం కొంతకాలంగా శ్రీలత క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె వయసు 44 సంవత్సరాలు.
బిజు, శ్రీలత ఎర్నాకులంలోని మహారాజా కాలేజీలో క్లాస్‌మేట్స్. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. జనవరి 23, 1998లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగిన 21 సంవత్సరాలవుతోంది. జీవిత భాగస్వామి మరణంతో బిజు నారాయణ్ విషాదంలో మునిగిపోయారు. శ్రీలత అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు కేరళలోని కళామాస్సెరీలో నిర్వహించనున్ననట్లు తెలుస్తోంది.

బిజు, శ్రీలత దంపతులకు సిద్ధార్థ్, సూర్య అనే ఇద్దరు కుమారుల ఉన్నారు. వీరిలో ఒకరు లా చదువుతూ డీజెగా రాణిస్తుండగా మరొకరు పాఠశాల విధ్యను అభ్యసిస్తున్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఇద్దరు కుమారులు విషాదంలో మునిగిపోయారు.
బిజు నారాయణ్ 1993లో వచ్చిన వెంకాలం సినిమాతో సింగర్‌గా కెరీర్ ప్రారంభించాడు. సౌతిండియాలో వివిధ భాషల్లో ఇప్పటి వరకు ఆయన వివిధ సినిమాల్లో దాదాపు 400 పాటలు పాడారు. భార్యను కోల్పోయిన విషాదంలో ఉన్న బిజును పలువురు సంగీత, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











