శబరిమలై అయ్యప్ప ఆలయంలో నగల చోరీ.. స్టార్ యాక్టర్‌ను ప్రశ్నించిన సిట్ అధికారులు
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలో నగల చోరీ వ్యవహారం దిగ్బ్రాంతిని కలిగిస్తున్నది. ఈ వ్యవహారంలో వస్తున్న అనేక అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నియమించారు. సిట్ అధికారులు తాజాగా దర్యాప్తు చేపడుతూ అనుమానితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళ నటుడు జయరామ్‌ను అధికారులు ప్రశ్నించారు. దాంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
శబరిమలై ఆలయంలో బంగారు నగల చోరీ వ్యవహారంలో మలయాళీ ఉన్నికృష్ణన్ పొట్టిని అనుమానిస్తున్నారు. ఆయనతో ఉన్న సంబంధాల కారణంగా నటుడు జయరామ్‌ను ప్రశ్నించాలని నిర్ణయం తీసుకొన్నారు. దాంతో ఆయనను చెన్నైలోని తన నివాసంలో ప్రశ్నించారు. ఆయనకు పలు ప్రశ్నల వేసి సమాధానాలను రికార్డ్ చేశారు. ఈ కేసులో ఆయన సాక్షిగా ఉండే అవకాశం ఉంది అని అధికారులు వెలువడుతున్నాయి.

శబరిమలై ఆలయానికి సంబంధించిన డోర్ ఫ్రేమ్‌లను నటుడు జయరామ్ ఇంటికి ఉన్నికృష్ణన్ పొట్టి తీసుకు రావడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత మీడియా సమావేశంలో బంగారు నగలతో పూజ చేయడం తన అదృష్టంగా భావిస్తాను అని చెప్పడం జరిగింది. అయప్ప భక్తుడిగా నాకు పొట్టితో సంబంధం ఉంది. కానీ ఆయన చేసే చోరీ వ్యవహారం గురించి నాకు ఎలాంటి సమాచారం తెలియదు అని జయరామ్ అన్నారు.
సంచలనం రేపిన ఈ కేసులో ట్రావంకోర్ దేవస్థానం బోర్డు మాజీ అధికారులిద్దరికి బెయిల్ లభించడంతో సిట్ అధికారులపై ఒత్తిడి పెరిగింది. వారిపై చార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం జరగడంపై విమర్శలు తలెత్తాయి. ఈ కేసులో సాక్ష్యాలను దాఖలు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే వాదన వినిపించింది. ఈ కేసు దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయనే విషయంపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ దర్యాప్తు వ్యవహారం సీరియస్‌గా మారింది.
2019లో అయప్ప స్వామి ఆలయానికి సంబంధించిన నగలతో పూజలు చేసిన వ్యవహారంపై ప్రశ్నించి పలు విషయాలను రాబట్టినట్టు తెలిసింది. ఈ చోరీ వ్యవహారంలో జయరామ్‌కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











