రాంగ్ రూట్‌లో వేగంగా డ్రైవింగ్.. దుల్కర్ సల్మాన్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్ షాక్!
సినీ తారలంటే రూల్స్‌కు లోబడి వ్యవహరిస్తారు.. ఫ్యాన్స్ వారిని అందుకే విలువకట్టలేనంతగా అభిమానిస్తుంటారు అని అభిప్రాయం అందరిలోను ఉంటుంది. అలాంటి హీరోలు అనుకోకుండా రూల్స్ విరుద్ధంగా వ్యవహరిస్తే అది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. అయితే తాజాగా టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కారు రాంగ్ రూట్‌లో ప్రయాణించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

దుల్కర్ ఫ్యామిలీకి కార్లంటే మోజు
దుల్కర్ సల్మాన్ ఫ్యామిలీకి ఖరీదైన, విలాసవంతమైన కార్లంటే ఎంతో మోజు. వారి ఇంటిలో ఎన్నో విలువైన కార్లు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ తండ్రి మమ్ముట్టికి సౌత్ ఇండియాలోనే ఎవరికీ లేని విధంగా విలువైన కార్లు ఉన్న పెద్ద గ్యారేజ్ ఉండటం తెలిసిందే.

మమ్ముట్టికి విలువైన 369 కార్ల గ్యారేజ్
మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టికి ఉన్న ఎన్నో కార్లను పెట్టడానికి 369 అనే వాహనాల గ్యారేజ్ ఏర్పాటు చేశారు. అందులో బీఎండబ్ల్యూ, మినీ కూపర్ ఎస్, జాగ్వర్ ఎక్స్ జే, టయోటా ల్యాండ్ క్రూజర్, ఆడి ఏ7, మిట్స్‌బుషి పజెరో స్పోర్ట్స్, టయోటా ఫార్చునర్ కార్లు ఉన్నాయి.

రాంగ్ రూట్‌లో దుల్కర్ సల్మాన్
అయితే తాజాగా మమ్ముట్టి కుమారుడు, దుల్కర్ సల్మాన్ తన విలావవంతమైన కారు పర్చే పనమేరా టర్బో కారులో ప్రయాణిస్తున్నారు. అయితే అనుకోకుండా రాంగ్ రూట్‌లో కారును వేగంగా పరుగులు పెట్టించాడు. రాంగ్ రూట్ అనే విషయం మరిచిపోయి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించారు.

వైరల్‌గా దుల్కర్ వీడియో
నీలిరంగు కారు రాంగ్ రూట్‌లో ఉందనే విషయాన్ని పసిగట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఆ వాహనం డ్రైవర్‌ను హెచ్చరించారు. దాంతో కారును చాలా వేగంగా వెనక్కి పరుగులు పెట్టించి సరైన దారిలోకి కారును నడిపాడు. ఈ వ్యవహారమంతా టూ వీలర్ వాహనం దారుడు వీడియోలో బంధించాడు.

దుల్కర్ కారును వెంబడించిన ఫ్యాన్స్
దుల్కర్ సల్మాన్ కారు అని గ్రహించిన టూ వీలర్ వాహనం దారుడు వీడియో తీస్తూ ఆ వాహనాన్ని వెంబడించారు. దాదాపు చాలా దూరం దుల్కర్ కారును వెంబడిస్తూ వీడియో చిత్రీకరించాడు. ప్రస్తుతం అభిమాని చిత్రీకరించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











