ఘోర ప్రమాదంలో యువ గాయని మంజూష దుర్మరణం .. ఐడియా స్టార్ సింగర్‌గా, ఫ్రెండ్‌తో కలసి!
యువ మలయాళీ గాయని మంజూష మోహన్ దాస్(27) 2009 లో జరిగిన ఐడియా స్టార్ సింగర్ తో పాపులర్ అయింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందింది. తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన మంజూష కొచ్చి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఈ ప్రమాదానికి సంబందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

స్నేహితురాలితో కలసి
గత వారం మంజూష తన స్నేహితురాలు అంజనతో కలసి అంగమలైలో స్కూటీలో ప్రయాణం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికీ ఎదురుగా వచ్చిన వ్యాన్ వీరిని బలంగా ఢీ కొట్టింది. తీవ్రమైన గాయాలతో మంజూషని ఆసుపత్రిలో చేర్పించారు.

ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా
స్థానికుల సమాచారం ప్రకారం మంజూష స్కూటీకి ఎదురుగా వచ్చిన వాహనం రాంగ్ రూట్ లో వచ్చినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిభందనలని పాటించకపోవడం వలనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.

ఐడియా స్టార్ సింగర్
ఐడియా స్టార్ సింగర్ 2009 కార్యక్రమంతో మంజూష సింగర్ గా బాగా పాపులర్ అయింది. ఆగష్టు 2 న మంజూష చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వైవాహిక జీవితం
మంజూష శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ లో సంస్కృత విభాగంలో డిగ్రీ పొందింది. ప్రియదర్శన్ అనే వ్యక్తితో మంజూష వివాహం జరిగింది. మంజుషాకు ఓ కుమార్తె కూడా ఉంది. మంజూష మరణంతో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











