సినిమాను కాపాడటానికేనా? మమ్ముట్టితో సన్నీ లియోన్ ఐటం సాంగ్... నవ్విస్తున్న మీమ్స్!
Recommended Video

పోర్న్ ఇండస్ట్రీ నుంచి ఇండియన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత సన్నీ లియోన్ సంచలన తారగా ఎదిగారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. సన్నీ లియోన్ ఐటం సాంగ్ ఉండే ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుండటంతో ఆమెతో ప్రత్యేక గీతం చేయించడానికి ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు.
మమ్ముట్టి నటిస్తున్న 'మధుర రాజా' అనే సినిమా ద్వారా సన్నీ లియోన్ మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమె ఐటం సాంగులో నటిస్తోందని, ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

మమ్ముట్టి, సన్నీపై మీమ్స్, ట్రోల్స్
‘మధుర రాజా' షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫోటో బయటకు వచ్చింది. మమ్ముట్టి పక్కనే సన్నీ లియోన్ కూర్చున్నట్లు ఉన్న ఈ ఫోటోపై ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫన్నీ ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి.

ఫ్యాన్స్‌ను తెగ నవ్విస్తున్నాయి
మమ్ముట్టి ఏజ్ గురించి సన్నీ లియోన్ అడుగుతున్నట్లు... దానికి ఆయన అదిరిపోయే సమాధానం ఇస్తున్నట్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ మీమ్స్ నెటిజన్లను, మమ్ముట్టి అభిమానులను తెగ నవ్విస్తున్నాయి.

సినిమాను కాపాడటానికే అంటూ...
మమ్ముట్టిన ఇపుడు మలయాళం ఇండస్ట్రీలో వన్నె తగ్గిన స్టార్ అని, ‘మధుర రాజా' చిత్రాన్ని కాపాడటానికే ఈ చిత్రంలోకి సన్నీ లియోన్‌ను తీసుకొచ్చారని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది మమ్ముట్టి యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ అని మరికొందరి వాదన.

మధుర రాజా
‘మధుర రాజా' సినిమా విషయానికొస్తే.. గతంలో మమ్ముట్టి, శ్రీయ, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘పోకిరి రాజా' చిత్రానికి సీక్వెల్. అయితే ఇందులో పృథ్వీరాజ్ నటించడం లేదని, తమిళ నటుడు జై కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తెలుగు నటుడు జగపతి బాబు కూడా కీలకమైన పాత్రలో చేస్తున్నాడు.

సన్నీ లియోన్
‘మధుర రాజా'తో పాటు త్వరలో మరో మలయాళం సినిమాలో కూడా సన్నీ లియోన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ‘రంగీలా' పేరుతో తెరకెక్కే ఈ చిత్రానికి సంతోష్ నాయర్ దర్శకత్వం వహించబోతున్నారు, ఫిబ్రవరిలో ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సన్నీ లియోన్ తన సౌత్ మూవీ ‘వీరమహాదేవి' రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











