స్టార్ హీరోతో సన్నిలియోన్ రొమాన్స్.. మధురరాజా చిత్రంలో స్పెషల్ సాంగ్
మలయాళ చిత్ర పరిశ్రమను కేకపుట్టించేందుకు శృంగారతార సన్నిలియోన్ సిద్ధమవుతున్నట్టు వార్తలు వైరల్‌గా మారాయి. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో స్టెప్పలు వేయడానికి సన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సెన్సేషనల్ హిట్ పోకిరిరాజాకు సీక్వెల్‌గా వస్తున్న మధురరాజా చిత్రంలో సన్నిలియోన్ నటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారనే ఓ తాజా వార్త మలయాళ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నది.
మధురరాజ చిత్రానికి వ్యాసఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. గోపి సుందర్ రూపొందించిన ఓ ఫ్యాన్సీ నంబర్‌లో మమ్ముట్టితో కలిసి స్టెప్పులు వేయనున్నారు.

మధురరాజా చిత్ర సెట్స్‌లో మమ్ముట్టితో కలిసి కూర్చొని ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికే వీరమదేవితో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే రంగీలా అనే చిత్రంలో ఐటెమ్ నంబర్‌లో నటిస్తున్నది. అంతేకాకుండా తమిళంలో విశాల్ చిత్రం ఆయోగ్య చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.
పోర్న్ స్టార్ అయిన సన్నిలీయోన్ 2012లో జిస్మ్ 2 అనే చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో కూడా నటించారు. తెలుగులో గరుడ వేగ చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో నర్తించగా దానికి అత్యంత ప్రజాదరణ లభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











