ఫోటోగ్రాఫర్‌గా మారిన స్టార్ హీరో ఎవరో తెలుసా? లాక్‌డౌన్‌లో ఓల్డ్ హాబీతో ఇలా!
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటన కాకుండా ఏదైనా ఇష్టమున్నదంటే అది ఫొటోగ్రఫీనే. గతంలో తనకు ఫొటోగ్రఫి అంటే ఇష్టమని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక లాక్‌డౌన్ సమయంలో తనకు ఇష్టమైన పనిని ఆచరణలో పెట్టారు. ఫోటోగ్రాఫర్‌గా మారిన మమ్ముట్టి ప్రకృతిని తన కెమెరాలో బంధించే ప్రయత్నాలు చేశారు. తన ఇంటి పరిసరాల్లోకి వచ్చిన పక్షులను, పచ్చని చెట్లను తన కెమెరాతో క్లిక్ మనిపించారు. ఇలా ఫోటోలో తీసే పనిలో ఉండగా.. మమ్ముట్టిని మరొకరు కెమెరాలో బంధించడంతో ఆయన అభిరుచి ప్రపంచానికి తెలిసి వచ్చింది.
తన ఇంటి ఆవరణలో కుర్చి వేసుకొని ట్రైపాడ్‌పై కెమెరా పెట్టుకొని పక్షులను బంధించారు. అనంతరం తాను తీసిన ఫోటోలను మమ్ముట్టి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఫొటోగ్రఫి నా పాత హాబీ. సమయం చిక్కడంతో నా హాబీని బయటకు తీశాను. ఇదిగో నేను తీసిన పక్షుల ఫోటోలు. నా ఉదయం పూట పలకరించిన గెస్టులు అంటూ మూడు రకాల పక్షుల ఫోటోలను పంచుకొన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో మమ్ముట్టి పెట్టిన ఫోటోలపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇతర సినీ ప్రముఖులు స్పందించారు. దాదాపు ఇన్స్‌టాగ్రామ్‌లో సుమారు 4 లక్షల లైక్స్ వచ్చాయి.

కెరీర్ విషయానికి వస్తే.. డైరెక్టర్ అజయ్ వాసుదేవన్ దర్శకత్వంలో వచ్చిన షైలాక్ చిత్రంలో మమ్ముట్టి నటించారు. 2020 జనవరి 23న రిలీజైన ఈ చిత్రం మలయాళంలో భారీ విజయాన్నిఅందుకొన్నది. ఆడియెన్స్, విమర్శకులు మమ్మట్టి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆయన నటించిన పొలిటికల్ థ్రిల్లర్ వన్ చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. ఈ చిత్రంలో కేరళ ముఖ్యమంత్రి కెడక్కల్ చంద్రన్‌గా కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











