మోహన్ లాల్ సెన్సేషనల్ సాంగ్ ‘జిమ్మిక్కి కమ్మల్’ యూట్యూబ్ నుండి తొలగింపు!
మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ "వెళిపడింతె పుస్తకం"లోని జిమ్మిక్కి కమ్మల్ సాంగ్ ఆ మధ్య ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్యూబ్‌లో ఈ సాంగుకు 80 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇక కేరళ సినీ అభిమానులైతే ఈ పాటకు ఫ్లాష్ మోబ్స్, డబ్ స్మాష్‌లతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
మలయాళీ అమ్మాయి అయిన మన తెలుగు యాంకర్ సుమ కూడా జిమ్మిక్కి కమ్మల్ పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేసంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా దృష్టి మొత్తం ఈ పాట మూలంగా మలయాళ సినీ పరిశ్రమ వైపు మళ్లింది.

అయితే భారీ ఆదరణ పొందిన ఈ సాంగును యూట్యూబ్ నుండి తొలగించారు. ఎందుకు ఇలా జరిగింది అని అభిమానులు కంగారు పడటంతో తొలగించడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ సంగీత దర్శకుడు షాన్ రెహమాన్ తన ఫేస్ బుక్ ద్వారా ఒక ప్రకటన చేశారు.
'వెళిపడింతె పుస్తకం' చిత్ర కాపీ రైట్స్ ఓ ఛానెల్ కొనుక్కుంది. అందులో పాటకు సంబంధించిన కాపీరైట్స్ కూడా ఉన్నాయని, ఆ కారణంగానే యూట్యూబ్ నుండి దాన్ని తొలగించాల్సి వచ్చిందని షాన్ రెహమాన్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











