Hamare Baarah: కాంట్రవర్శీ మూవీకి సుప్రీం కోర్ట్ షాక్.. ఆ వీడియోపై సంచలన వ్యాఖ్యలు
గతంలో కంటే ఈ మధ్య కాలంలో కాంట్రవర్శీ స్టోరీలతో సినిమాలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. అందులో చాలా వరకూ చిత్రాల విడుదలకు ఎన్నో రకాల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. తద్వారా అలాంటివన్నీ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. ఇప్పుడు అలా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సినిమానే 'హమారే బారా' (Hamare Baarah).
ఫేమస్ యాక్టర్ అన్నూ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'హమారే బారా'. కమల్ చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ముస్లిం మహిళలపై హింసకు సంబంధించిన కథతో తెరకెక్కింది. దీంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఇది అంచనాలను భారీ స్థాయిలో ఏర్పడింది. అదే సమయంలో ఎన్నో వివాదాలకు సైతం కారణం అయింది.

'హమారే బారా' సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాపై పలువురు విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో ఈ సినిమా విడుదలపై ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే జూన్ 14 వరకు సినిమా విడుదలపై ముంబై హైకోర్టు కూడా నిషేధం విధించింది. ఆ తర్వాత విడుదలకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో కొన్ని అభ్యంతకరమైన డైలాగులను కట్ చేయమని చెప్పింది. దీనికి చిత్ర యూనిట్ కూడా అంగీకారం తెలిపింది.
'హమారే బారా' చిత్రానికి అడ్డంకులు తొలగిపోయిన తర్వాత అజరు బాషా తంబోలి అనే వ్యక్తి ఈ సినిమాను నిలిపేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో 'హమారే బారా' సినిమాను నిలిపేయాలని తాజాగా తీర్పును ఇచ్చింది.
తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో 'ఉదయం సినిమా ట్రైలర్‌ను చూశాం. అందులో అభ్యంతరకరమైన డైలాగులన్నీ ఉన్నాయి. అందుకే ఈ చిత్రం విడుదల నిలిపేయాలి' అని పేర్కొంది. ఇదిలా ఉండగా.. 'హమారే బారా' సినిమాను బిరేంద్ర భగత్, రవి ఎస్ గుప్తా, సంజయ్ నగ్పల్ నిర్మించారు.


Click it and Unblock the Notifications











