twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా ఎఫెక్ట్.. హీరోకు దూరంగా ఉన్న భార్య.. ఈ ఏడాది ఒంటరిగానే అంటూ ఎమోషనల్ పోస్ట్

    |

    కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతోన్నాయి. ఇప్పటికే 19 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. లక్ష మంది దాకా మృత్యువాత పడ్డారు. కరోనా ఇంతలా విజృంభిస్తోన్నా.. ప్రపంచ దేశాలు కట్టడి మాత్రం చేయలేకపోతున్నాయి. కరోనాకు విరుగుడు కనిపెట్టకపోవడమే ప్రధాన కారణమైతే.. అరికట్టడంలో కొన్ని దేశాలు విఫలమవ్వడం మరో కారణం.

    ఎక్కడివారు అక్కడే..

    ఎక్కడివారు అక్కడే..

    అయితే కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను మాత్రం భారతదేశం పకడ్బందీగా అమలు చేస్తోంది. దాదాపు గత నెల నుంచి మన దేశం లాక్ డౌన్‌ను అమలు పరుస్తూ వస్తోంది. తాజాగా మరో 19 రోజులు పొడిగింపుతో మే 3 వరకు ప్రజలెవరూ రోడ్లపై తిరగడానికి వీల్లేదు.

    విదేశాల్లో చిక్కిన భారతీయులు..

    విదేశాల్లో చిక్కిన భారతీయులు..

    కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలో విదేశీయులు చిక్కుకున్నట్లే.. భారతీయులు సైతం విదేశాల్లోనే చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్, ఆ మూవీ యూనిట్ అక్కడే ఇరుక్కుపోయింది.

    షూటింగ్ నిమిత్తం..

    ఆడుజీవితం అనే మూవీ షూటింగ్‌లో భాగంగా పృథ్వీరాజ్, ఆయన బృందం జోర్డాన్‌కు వెళ్లారు. అయితే కరోనా వ్యాప్తి చెందడంతో షూటింగ్‌ను అనుమతి ఇవ్వలేదంట. అయితే తరువాత మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో కొన్ని రోజులు పొడిగించారని తెలిపాడు. అయితే కరోనా మరింత తీవ్రతరం కావడంతో షూటింగ్ పూర్తిగా ఆపివేశామని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Mammootty's Mamangam Team Interview Part - 2
    భర్తకు దూరంగా భార్య..

    భర్తకు దూరంగా భార్య..

    పృథ్వీరాజ్‌కు దూరంగా ఉన్న ఆయన భార్య సుప్రియ మీనన్.. మళయాల తొలి పండుగ విషును మిస్ అయిపోయింది. గతేడాది తామిద్దం ఈ పండుగను ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నామని ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నామని తెగ ఎమోషనల్ అయింది. త్వరలోనే సమస్యలన్నీ తీరిపోయి కలుస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.

    English summary
    Supriya Menon Emotional On Prithviraj Sukumaran About Vishu Festival.Prithviraj Sukumaran About Lockdown And Stuck In Jordan. Aadu Jeevitham Unit Went To Jordan. But They Stuck Theie Due To Corona Epidemic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X