కేరళలో చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్.. తొలి బీజేపీ ఎంపీగా రికార్డు

మలయాళ సూపర్ స్టార్, బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టనున్నారు. కేరళలో ఎన్డీఏ తరఫున ఆయన సంచలన విజయాన్ని అందుకున్నారు. త్రిచూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన 74686 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కేరళలో బీజేపీకి తొలి విజయాన్ని అందించడం ఓ రికార్డుగా మారింది. ఇప్పటి వరకు విజయం చూడని కాషాయ పార్టీ కేరళలో ఎంపీ సీట్ ద్వారా బోణి కొట్టింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

కేరళలోని త్రిచూర్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎల్డీఎఫ్ నేత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్‌పై భారీ విజయాన్ని నమోదు చేశారు. సురేష్ గోపికి 412, 338 ఓట్లు రాగా, వీ సునీల్ కుమార్‌కు 337652 ఓట్లు పోలయ్యాయి. దాంతో ఆయనకు భారీ విజయం దక్కింది.

Suresh Gopi created history in Kerala

త్రిచూర్‌లో నియోజకవర్గం పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో క్లియర్ మెజారిటీ సంపాదించుకొని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పార్టీలను కంగు తినిపించారు. 2024 సంవత్సరంలో ఈ నియోజకవర్గం పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలను ఎల్డీఎఫ్ దక్కించుకోవడం గమనార్హం.

సురేష్ గోపి కెరీర్ విషయానికి వస్తే.. కేరళలో టెలివిజన్ సినీ ప్రేక్షకులకు సుపరితులు. ఆయన తలస్థానం, ఏకలవ్యన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. మొత్తంగా 250పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఆయన నటించిన యాక్షన్ చిత్రాలకు మంచి ఆదరణ కూడా లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X