twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నడిరోడ్డులో గర్భవతిని అలా.. సీనియర్ హీరోపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు, వీడియో వైరల్!

    |

    Recommended Video

    Suresh Gopi's Caring Touch On Baby Bump Irritates Netizens || Filmibeat Telugu

    సెలెబ్రిటీలు చేసే కొన్ని ఫీట్లు అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో తమ తప్పు లేకున్నా సెలెబ్రిటీలు విమర్శలు ఎదుర్కొంటుంటారు. మలయాళం సీనియర్ నటుడు సరేష్ గోపీ ప్రస్తుతం అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. సురేష్ గోపి ప్రస్తుతం త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సురేష్ గోపి ఓ గర్భిణీ స్త్రీ పట్ల ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది.

     గర్భవతిని అలా

    గర్భవతిని అలా

    సురేష్ గోపి ఇటీవల త్రిశూర్ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంత మంది స్త్రీలు ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారు. సురేష్ గోపితో సెల్ఫీలు దిగడానికి, హ్యాండ్ షేక్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో సురేష్ గోపి కారులో ఉన్నారు. ఓ గర్భిణీ స్త్రీ కూడా సురేష్ గోపిని కలిసింది. ఈ సందర్భంగా సురేష్ గోపి ఆమె గర్భంపై చేయి వేసి బిడ్డకు ఆశీర్వాదం తెలియజేశాడు. ఈ చర్యని ఇతర పార్టీ నేతలు. నెటిజట్లు తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

    దిగజారుడు చర్య

    దిగజారుడు చర్య

    సురేష్ గోపిని సిపిఐ నేతలు విమర్శిస్తూ.. ఓ పరాయి స్త్రీ గర్భంపై సురేష్ గోపి చేయ వేయడం ఏంటి. ఇది నీతిమాలిన చర్య. సురేష్ గోపి ఎన్నికల సందర్భంగా చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు నెటిజన్లు.. సురేష్ గోపి ఆరోగ్యం సరిగా ఉన్నట్లు లేదు. ఆయన వెంటనే త్రిసూర్ లో మంచి మానసిక వైద్యుడిని కలవాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

     సోదర భావంతోనే

    సోదర భావంతోనే

    ఇదిలా ఉండగా బిజెపి నేతలు మాత్రం సురేష్ గోపి చేసిన పనిని సమర్థిస్తున్నారు. సురేష్ గోపి ఆ మహిళ గర్భంపై చేయి వేసి సోదరభావంతో ఆశీర్వదించారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం వేరేలా కామెంట్ చేస్తున్నారు. పర స్త్రీలతో మెలిగేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వారి పట్ల పద్దతిగా ఉండాలి. ఎన్నికల్లో పబ్లిసిటీ కోసం మహిళలతో ఎలా పడితే అలా ప్రవర్తించడం సరి కాదు అని అంటున్నారు.

    వీడియో వైరల్

    సురేష్ గోపీ సదరు మహిళ గర్భంపై చేయి వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న సిపిఐ అభిమానుల పేస్ బుక్ పేజీలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం సురేష్ గోపి తన గర్భంపై చెవేసినప్పుడు సదరు మహిళ ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదు. ఆమె సంతోషంగా కనిపిస్తోంది.

    English summary
    Suresh Gopi's caring touch on baby bump irritates, calls him a man of immorality. Many people, especially workers of CPI(M) and SDPI have claimed that Suresh Gopi is a man with immorality after he touched the baby bump of a woman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X