గదిలోకి పిలిచి.. చెప్పరాని చోట అలా అసభ్యంగా తడుముతూ.. డైరెక్టర్ వేధింపులపై నటి సంచలనం
హేమ కమిటీ బహిర్గతమైన తర్వాత మలయాళం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, మహిళ నటుల వేధింపుల కథలు కథలుగా బయటకు వస్తున్నాయి. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, ఇతర సాంకేతిక నిపుణుల నుంచి ఎదురైన బాధలను మీడియా ముందు ఏకరువు పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టారు. తాజాగా సుడల్ 2 వెబ్ సిరీస్‌లో నటించిన నటి తనకు జరిగిన వేధింపుల ఘటనను బహిర్గతం చేసింది. ఓ డైరెక్టర్ నుంచి ఎదురైన లైంగిక దాడి గురించి వెల్లడిస్తూ..
మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందిన నటి అశ్వినీ నంబియార్. పుదు నెల్లు పుదు నాతు అనే చిత్రం ద్వారా మలయాళ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మణిచిత్రతాజులు అనే పాపులర్ సినిమాతో మరింత గుర్తింపును, పాపులారిటీ సంపాదించారు. అయితే ఆమె ప్రతిభ తమిళ, మలయాళ భాషలకే పరిమితం కాలేదు. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు.

మలయాళంలో గుర్తింపు ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్న ఆమెకు తెలుగులో అవకాశాలు తలుపుతట్టాయి. తెలుగులో ఆంటీ అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన హిట్లర్, వెంకటేష్ నటించిన పెళ్లి చేసుకొందాం సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఆ తర్వాత పోలీస్ అనే సినిమాలో కూడా కీలక పాత్రలను పోషించింది. ఆమె సినిమాలే కాకుండా టెలివిజన్ సీరియల్స్‌లో కూడా మెప్పించింది.
పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు బ్రేక్ తీసుకొన్న ఆమె మళ్లీ మలయాళంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సుడల్: ది వొర్టెక్స్ అనే వెబ్ సిరీస్‌లో మాలతి పాత్ర ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్నారు. సుడల్ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఓ డైరెక్టర్ తనతో అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని బయటపెట్టారు. తనను లైంగికంగా వేధించారు అంటూ వెల్లడించారు.
మలయాళ సినిమా రంగంలో ఏదైనా సినిమాకు సంబంధించిన చర్చలకు వెళ్లినప్పుడు తోడుగా మా అమ్మను తీసుకెళ్లే దానిని. కానీ అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరొకరిని తోడుగా తీసుకెళ్లాను. ఓ డైరెక్టర్ సినిమా గురించి చర్చించాలని పిలిచారు. దాంతో నేను అక్కడికి వెళ్లగా ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ.. పైన గదిలో డైరెక్టర్ ఉన్నాడు. మీరు ఒక్కరే వెళ్లండి అని చెప్పారు. దాంతో నేను ఒంటరిగా మెట్లెక్కి పై గదిలోకి వెళ్లాను అని ఆమె తెలిపారు.
గదిలోకి వెళ్లగానే ఓ వయసు పైబడిన వ్యక్తి కనిపించాడు.తనకు తాను డైరెక్టర్ అని పరిచయం చేసుకొన్నాడు. గదిలోకి వెళ్లగానే నన్ను చెప్పలేని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. నాకు అప్పుడు అర్ధమైంది. ఇది క్యాస్టింగ్ కౌచ్ కాదు.. నన్ను ట్రాప్ చేసి గదిలోకి పంపించారని తెలిసింది. అయితే తాను ఆ సమయంలో అతడిని ఎదురించి వెంటనే బయటకు వచ్చాను. నా తండ్రి వయసు ఉన్న వ్యక్తి ప్రవర్తన చూసి అసహ్యం వేసింది అని అశ్వినీ నంబియార్ చెప్పారు.


Click it and Unblock the Notifications











