50 ఏళ్ల వయస్సులో ప్రేమ పెళ్లి చేసుకున్న నటుడు.. లేటు అయినా లేటెస్ట్ గా..
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి, విడాకులు అనే అంశం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఎవరెప్పుడు విడిపోతారు చెప్పడం చాలా కష్టం. తాజాగా ఓ సీరియల్ నటుల జంట ఒక్కటింది. అది కూడా లేటు వయసులో ఘాటుగా ప్రేమించుకుని.. మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇంతకీ 50 సంవత్సరాల ఏజ్ లో పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు? ఆ నటిమణీ ఎవరు? అనేది మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇండస్ట్రీలో లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అని ఫ్యాషన్ మారింది. ప్రస్తుతం ట్రెండ్ వెండి తెర నుండి బుల్లితెరకు కూడా పాకినట్లు అనిపిస్తుంది. కొంతమంది సెలబ్రిటీలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు లేటు వయసులో కూడా పెళ్లి చేసుకోకుండా.. తమ కెరీర్ మీదనే ఫోకస్ చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ బుల్లితెర జంట వివాహ బంధంతో ఒక్కటయింది. ఆ నటుడికి 50 ఏళ్ల కాగా.. ఆ నటికి 37 ఏళ్లు.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ జంట ఎవరో కాదు.. 50 ఏళ్ల బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ (Kris Venugopal), 37 ఏళ్ల మలయాళ నటి దివ్య శ్రీధర్ (Divya Sreedhar). వీరిద్దరూ బుధవారం తన లవ్ స్టోర్టీకి శుభం కార్డు వేసి.. వివాహ బంధంతో ఒక్కయ్యారు. వీరి వివాహ వేడుక కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం జరిగింది. ఈ వేడుక చాలా తక్కువ మంది సన్నితుల మధ్య జరిగినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్‌లో కలిసి నటించారు. అయితే.. దివ్య శ్రీధర్‌కు ఇది వరకే వివాహం జరిగింది. ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటి దివ్యకు ఇది సెకండ్ మ్యారేజ్.
పాతరమట్టు సీరియల్ షూటింగ్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఇక దివ్య సీరియల్‌లో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేస్తుంది. పెళ్లి తర్వాత ఆమె మాట్లాడుతూ.. తానే మొదట ప్రపోజ్ చేశాడనీ, పెళ్లి చేసుకోవాలనుందని చెప్పాడనీ, ఆ సమయంలో తనకేమీ అర్థం కాలేదన్నారు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందుకు నన్ను ఒప్పించారు. ఈ విషయాన్ని పిల్లలకు చెప్పితే.. వాళ్లు ఎంతగానో సంతోషించారనీ, తన పిల్లల ఇష్టం ప్రకారమే తాను పెళ్లి చేసుకున్నాననీ, వారికి నాన్న ప్రేమ దొరుకుతుంది అన్నారు.

ఇక క్రిస్ వేణుగోపాల్ విషయానికి వస్తే ఆయన ఓ రచయిత, వాయిస్ ఆర్టిస్ట్, యాక్టర్. వీరిద్దరూ సీరియల్స్‌తోపాటు పలు సినిమాల్లో కూడా నటించారు. ప్రస్తుతం వీళ్లు పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో వీరి ఫోటోలు వైరల్ కావడంతో లేటు వయసులోనైనా లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్నారు అంటూ నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











