2 కోట్ల బడ్జెట్, 50 కోట్లు వసూళ్లు... టాలీవుడ్ నిర్మాతలను ఊరిస్తున్న సినిమా!
రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర వస్తేనే సూపర్ హిట్టు, బంపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్టు అంటారు. మరి 2 కోట్ల పెట్టుబడికి రూ. 50 కోట్లు వసూలైతే దాన్ని ఏమంటారు? బహుషా ఇలాంటి విజయాన్ని నిర్వచించడానికి సినిమా వాళ్ల భాషలో పదాలు లేవేమో?
చిన్న సినిమాలుగా వచ్చి ఆశ్చర్య పరిచే విజయాలు సాధించడం, బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయడం ఎప్పుడో అరుదుగా జరుగుతూ ఉంటాయి. గతంలో 'సైరత్' అనే మరాఠీ చిత్రం విషయంలో ఇలాంటి అద్భుతమే జరిగింది. జులై 2019లో మలయాళంలోనూ ఇలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిన సినిమా ఒకటి వచ్చింది.

'తన్నీర్ మాథన్ దినంగల్' అనే మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. గిరీష్ ఎ. డి దర్శకత్వం వహించిన ఈ మూవీని కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్లో నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. రూ. 50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో వినీత్ శ్రీనివాసన్, మాథ్యూ థామస్, అనాశ్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ కథకు కనెక్ట్ అవ్వడమే. కాలేజీ డేస్ టీనేజీ లవ్ స్టోరీతో ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీ యువతకు బాగా నచ్చడమే ఈ విజయానికి కారణం అంటున్నారు. తాజాగా సమాచారం ప్రకారం 'తన్నీర్ మాథన్ దినంగల్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











