The Goat Life Trailer Review పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ కథేంటో తెలుసా? 10 ఏళ్ల తర్వాత రిలీజ్ ఎందుకంటే?
మలయాళంలో లూసిఫర్, తాజాగా సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం (The Goat Life) విడుదలకు సిద్దమవుతున్నది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందిన ఈ సినిమా మార్చి 28వ తేదీన రిలీజ్ కావడానికి ముస్తాబవుతున్నది. ప్రముఖ రచయిత బెన్యామిన్ రచించిన గోట్ డేష్ (Goat Days) అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
ఆడు జీవితం బతుకుతెరువు కోసం పరాయి దేశానికి వలస వెళ్లిన అభాగ్యుడి కథ. పేదరికంతో బాధపడుతూ నజీబ్ అనే వ్యక్తి కేరళ నుంచి విదేశాలకు వలస వెళ్తాడు. వలస వెళ్లిన ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? అతడికి ఎదురైన సమస్యలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సినిమా కథ.

అత్యంత ప్రజాదరణ పొందిన గోట్ డేస్ నవలను ఆడు జీవితం (The Goat Life) అనే సినిమాగా మలచడానికి పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బెస్లీ 10 ఏళ్ల క్రితం చేతులు కలిపాడు.ఈ సినిమా విషయంలో ఎలాంటి రాజీ పడకుండా క్వాలిటీతో నిర్మించడానికి పది సంవత్సరాలు కష్టపడ్డారు. కరోనా సమయంలో గల్ఫ్ కంట్రీస్‌లో షూటింగ్ చేస్తూ చాలా మంది కోవిడ్ పాజిటివ్‌కు గురయ్యారు. చాలా సమస్యలను అధిగమించి ఈ సినిమాను పూర్తి చేశారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరెక్కిన ఆడు జీవితం చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే.. ఎడారిలో చిక్కుకొన్న వలస కూలి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించారు. హిందీలో అత్యంత ప్రాచుర్యం పొందిన బాబీ సినిమాలోని పాపులర్ సాంగ్ అందర్ సే కోయి బాహర్ నా సకే. (లోపలి నుంచి బయటకు ఎవరు వెళ్లే అవకాశం లేదు) అనే పాటలోని లైన్‌ను డైలాగ్‌గా పదే పదే వాడుతూ కనిపించారు. ట్రైలర్‌లో చూపించింది రెండు సన్నివేశాల్లోనే గుండె తరుక్కు పోయేలా ఉన్నాయి. ఫస్ట్ లుక్ లోనే మంచి ఇంప్రెషన్ కలిగించారు.
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్ (హాలీవుడ్ నటుడు), అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
మ్యూజిక్: ఏఆర్ రెహమాన్
నిర్మాణం: విజువల్ రొమాన్స్
దర్శకత్వం: బ్లెస్సీ


Click it and Unblock the Notifications











