For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నటి కొంప ముంచిన ఫోటోల పిచ్చి.. ఆ ఫోటోలు పోస్ట్ చేయడంతో అరెస్ట్.. అసలు ఏమైందంటే?

  |

  మలయాళ టీవీ సీరియల్ నటి నిమిషా అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. అయితే ఆమెను అరెస్ట్ చేసిన కొద్దీ సేపటికి పోలీసులు మళ్ళీ పోలీస్ స్టేషన్ బెయిల్ మీద విడుదల చేశారు. అయితే ఆమె చేసిన నేరం ఏంటి? ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు ? అనే వివరాల్లోకి వెళితే

  మనోభావాలు దెబ్బ తీయడంతో

  మనోభావాలు దెబ్బ తీయడంతో

  దేవాలయ ఆచారాలను ఉల్లంఘించినందుకు విచారణ ఎదుర్కొంటున్న మలయాళ టీవీ సీరియల్ నటి నిమిషా, కేరళలో సంప్రదాయ పడవలో బూట్లు ధరించిన తర్వాత అరెస్టు చేయబడింది. శనివారం, నిమిషాను అరెస్టు చేసి, ఆమె స్టేట్‌మెంట్ పోలీసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. నిమిషాతో పాటు ఆమె ఫోటోలు తీయడంలో ఆమెకు సహాయపడిన స్నేహితుడి స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేయబడిందని పోలీసులు తెలిపారు. అయితే, తర్వాత ఇద్దరూ పోలీసు స్టేషన్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు.

  స్టేషన్ బెయిల్ మీద విడుదల

  స్టేషన్ బెయిల్ మీద విడుదల

  పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు "ఇంతకు ముందే వారు కేసు నమోదు చేశారు. నిన్న అంటే శనివారం, ఆమెను తన స్నేహితుడితో సహా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ అనంతరం వారిద్దరినీ అరెస్ట్ చేశారు. వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత, ఆమెను ఆమె స్నేహితుడిని పోలీసు స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. బుధవారం నాడు నిమిషా స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  ఆడుకున్నరుగా

  ఆడుకున్నరుగా

  ఈ ఫిర్యాదులో నిమిషా తనను ఫోన్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేసి దూషణలు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ప్రస్తావించారు. నిమిషా తన కొంతమంది స్నేహితులతో కలిసి ప్రసిద్ధ ఆరన్ముల దేవాలయంలోని పల్లియోదం అనే పడవను చూడడానికి వెళ్ళింది. చూసి వచ్చేసుంటే బాగుండేది కానీ దాని మీద పాదరక్షలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  వాళ్ళు ఫిర్యాదు చేయడంతో

  వాళ్ళు ఫిర్యాదు చేయడంతో

  పల్లియోదం యాజమాన్యంలోని పుతుకులంగర పల్లియోదం సేవా సమితి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిమిషను ఆమె స్నేహితుడు ఉన్ని మీద కేసు నమోదైంది. ఆమె తన సోషల్ మీడియా పేజీలో ఫోటోలను పోస్ట్ చేసిన తర్వాత ఆమె తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. తిరువళ్ల పోలీసులు ఆమెపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు. ఈ పల్లియోడం అనేది పంబా నదిలో ప్రసిద్ధి చెందిన నీటి ఊరేగింపు కోసం పట్నం తిట్ట జిల్లాలోని అరణ్ముల దేవాలయం ఉపయోగించే పాము పడవ.

   శ్రీ కృష్ణుడి డిజైన్

  శ్రీ కృష్ణుడి డిజైన్

  ఒక స్థానిక పురాణం ప్రకారం, పాములా కనిపించే ఈ పడవలు శ్రీకృష్ణుడు డిజైన్ చేసినవి. ఒక రకమైన జాక్ ఫ్రూట్ చెట్టుతో తయారు చేసిన ఈ పడవలు వేద పాఠంలోని సూచనల ప్రకారం చెక్కబడ్డాయి మరియు అవి దైవికంగా పరిగణించబడతాయి. పతనంతిట్ట జిల్లాలోని ఆరన్ములలో ఊరేగింపులో పాల్గొనే 52 పల్లియోదంలు ఉన్నాయి. ఆరన్ముల పార్థసారథి దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా ఈ ఊరేగింపు జరుగుతుంది.

  అసలు ఆడవాళ్ళకి నో ఎంట్రీ

  అసలు ఆడవాళ్ళకి నో ఎంట్రీ

  సాధారణంగా ఈ పడవలను పల్లియోడ పుర అనే ప్రత్యేక షెడ్లలో ఉంచుతారు, ఇక్కడ బయటి వ్యక్తులను అనుమతించరు. తపస్సు చేసిన తర్వాత మాత్రమే పల్లియోదంలోకి ప్రవేశించాలని, బూట్లు ధరించి పల్లియోడం ప్రవేశించడం అంటే హిందూ సంప్రదాయాలను మట్టిగాలాపడమే అని ఆరోపిస్తున్నారు. నిమిష భక్తుల మనోభావాలను దెబ్బతీసిందనే సమితి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు అయింది. అలాగే పల్లియోదములలోకి మహిళలను అనుమతించలేదనే నివేదికలు కూడా ఉన్నాయి.

  Recommended Video

  Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu
  సోషల్ మీడియా కొంప ముంచింది

  సోషల్ మీడియా కొంప ముంచింది

  నిజానికి నిమిషా ఫోటోలు దిగినప్పుడు ఇబ్బంది లేదు కానీ ఈ ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకున్న తర్వాత వివాదం తలెత్తింది. ప్రజలు సోషల్ మీడియాలో నిమిషాను టార్గెట్ చేయడం ప్రారంభించారు, ఆ తర్వాత నటి ఆ ఫోటోలను సోషల్ మీడియా నుండి తీసివేసింది. అయితే, విషయం ఇక్కడితో ఆగలేదు. పోలీసు కేసు దాకా వెళ్లడం ఆమె అరెస్ట్ కావడం తెలిసిందే.

  English summary
  Thiruvalla Police on Saturday arrested a Malayalam TV serial actress who is facing a probe for allegedly violating temple customs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X