Thug Life: కమల్ హాసన్ థగ్ లైఫ్ సెట్లో ప్రమాదం... యాక్షన్ సీక్వెన్స్ లో నటుడికి గాయాలు

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ థగ్ లైఫ్ సెట్ లో భారీ ప్రమాదం జరగగా, ఓ నటుడు గాయపడ్డట్టుగా సమాచారం. ప్రమాదం ఎలా జరిగింది? గాయపడిన నటుడు ఎవరు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.

తమిళ దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, నాజర్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి వంటి నటినటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా ప్రమాదం కారణంగా బ్రేక్ పడింది.

Thug Life actor Joju George meets with an accident

ప్రస్తుతం కమల్ హాసన్ తో పాటు సినిమాలోని పలువురు నటులకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరిలో సినిమా షూటింగ్ జరుగుతుండగా, యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఓ హెలికాప్టర్ సీన్ ను షూట్ చేస్తున్నారు.

ఇక ఆ సన్నివేశంలో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ పై యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నారు మేకర్స్. షాట్ లో తన సహ నటుడైన నాజర్ తో కలిసి హెలికాప్టర్ నుంచి జోజు జార్జ్ దూకాల్సి ఉంది. ఈ భారీ స్టంట్ చేస్తున్నప్పుడే ప్రమాదవశాత్తు బోజు హెలికాప్టర్ నుంచి పడిపోయినట్టుగా సమాచారం. దీంతో ఆయన ఎడమ కాలికి తీవ్రంగా గాయమైందని తెలుస్తోంది.

వెంటనే అప్రమత్తమైన చిత్రబృందం ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు చికిత్స చేశారు. ట్రీట్మెంట్ అనంతరం డాక్టర్స్ జోజును వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు టాక్ నడుస్తోంది. అయితే బోజు మాత్రం గాయమైనప్పటికీ లెక్కచేయకుండా పుదుచ్చేరిలో సినిమా షూటింగ్ ను కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ కాలికి తీవ్రంగా ఫ్రాక్చర్ కావడంతో ఆయన షూటింగ్ లో ఎలా పాల్గొంటారు అన్నదే ప్రశ్న.

Thug Life actor Joju George meets with an accident

కాగా ఇప్పటికే పుదుచ్చేరి విమానాశ్రయంలో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు. అందులో కమల్ హాసన్ శింబుతో పాటు అశోక్ సెల్వన్ కూడా పాల్గొన్నారు. గతంలోనే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా థగ్ లైఫ్ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు జోజు గాయపడినప్పటికీ షూటింగ్ ను ఎలా కంటిన్యూ చేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

జోజును పక్కన పెట్టి మిగతా సన్నివేశాలు చిత్రీకరిస్తారా? లేదంటే డూప్ తో మేనేజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ విషయం గురించి చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే జోజు జార్జ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అలాగే ఇలాంటి హై ఆక్టెన్ యాక్షన్ సిక్వెన్స్ షూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

More from Filmibeat

Read more about: thug life actor joju george accident
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X