టోవినో థామస్‌కు తీవ్ర ప్రమాదం... కాలా షూటింగ్‌లో గాయపడి ఐసీయూలో చికిిత్స

మలయాళ నటుడు టోవినో థామస్ తాజాగా కాలా సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. టాలెంటేడ్ యాక్టర్ కాలా సినిమాతో ఆడియెన్స్ సరికొత్తగా ఆకట్టుకోవాలని సిద్ధమవుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఇటీవల సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో స్టంట్స్ చేస్తుండగా అతని కడుపుకు తీవ్ర గాయమయ్యింది. ఇక టోవినో థామస్ కేవలం మళయాళంలోనే కాకుండా కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించాడు.

2012లో మలయాళం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన థామస్ మొదటి నుంచి కూడా ప్రయోగాత్మకమైన పాత్రల్లోనే కనిపిస్తున్నాడు. మోహన్ లాల్ హిట్ మూవీ లూసిఫర్ లో కూడా అతను ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక ఈ మధ్య కాలంలో అతని నటనకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇక కాలా సినిమా కోసం ఎంతగానో శ్రమిస్తున్న ఈ యువ నటుడు ఇటీవల ఒక రిస్క్ షాట్ చేసి ఆస్పత్రిపాలయ్యాడు.

Tovino Thomas injured during Kala shoot currently in ICU under treatment

గాయపడిన వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు అతన్ని కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రక్త స్రావం కూడా జరిగినట్లు తెలుస్తోంది. గాయం పెద్దది కావడంతో వైద్యులు వెంటనే అతన్ని ఐసీయూకి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక టోవినో థామస్ వీలైనంత త్వరగా కొలుకోవాలని అభిమానులతో పాటు సినీ సెలెబ్రెటీలు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

మలయాళ మీడియా కథనాల ప్రకారం టోవినో థామస్ హెల్త్ పై పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అతను త్వరగానే కోలుకునే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక అఫీషియల్ గా వివరణ ఇచ్చే వరకు ఎవరు కూడా రూమర్స్ ని నమ్మవద్దని టోవినో థామస్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X