నగ్నంగా నటించు, లేదా రూ. 5 లక్షలు కట్టు.. మహిళా దర్శకురాలిపై కేసు

సినీ రంగంలో జరిగే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే మనం చాలా విన్నాం. ఈ క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది నటీమణులు మీటూ పేరిట ఎంతోమందిలో దాగి ఉన్న చీకటి కోణాన్ని బయటపెట్టారు. అవకాశం ఇస్తే తమకేంటీ లాభం అని అడిగినవాళ్లు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతోమంది ఉన్నారు. ఇక ఇండస్ట్రీ అన్నాక ఇదంత కామన్ అని అనేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇదంతా చూస్తుంటే అమ్మాయిలకే ఇలా జరుగుతుందని అనుకుంటారు. కానీ, ఇటీవల జరిగిన ఓ సంఘటన చూస్తే అబ్బాయిలు కూడా ఇలాంటివి ఎదుర్కొవాల్సిందేనని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కెరీర్ ప్రారంభంలో..

కెరీర్ ప్రారంభంలో..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ను యువతులే కాదు యువకులు కూడా ఎదుర్కొన్నారు. అప్పట్లో రణ్ వీర్ సింగ్ వంటి తదితర హీరోలు తమ కెరీర్ ప్రారంభంలో ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు పలు సమావేశాల్లో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఓ బుల్లితెర నటుడు ఇలాంటి సంఘటననే ఫేస్ చేశాడు.

ఎప్పటికైనా సినిమాల్లో..

ఎప్పటికైనా సినిమాల్లో..

బుల్లితెరకు చెందిన ఓ నటుడు ఎప్పటికైనా సినిమాల్లో రాణించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలో నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒక మూవీలో నటించే అవకాశం వచ్చింది. తమ వద్ద సినిమా ఆఫర్ ఉందని, మంచి పారితోషికం కూడా ఇస్తామని కేరళకు చెందిన ఓ మహిళా డైరెక్టర్ అతన్ని సంప్రదించింది.

ఆనందంలో ఏం చదవకుండానే..

ఆనందంలో ఏం చదవకుండానే..

అయితే ముందుగా అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సిందిగా సదరు డైరెక్టర్ తెలిపిందట. తనకు సినిమా అవకాశం వచ్చినందన్న ఆనందంలో ఏం చదవకుండానే ఒప్పందపత్రంపై సంతకం చేశాడు ఆ నటుడు. తీరా షూటింగ్ మొదలయ్యాక నగ్నంగా నటించమనడంతో అతను షాక్ అయ్యాడు.

 నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లారు..

నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లారు..

ఈ సంఘటన గురించి ''అది నాకు తొలి షూటింగ్. నేను అగ్రిమెంట్ చదవకుండానే సంతకం పెట్టాను. వారితో కలిసి షూటింగ్ కు వెళ్లాక నన్ను ఓ గదిలోకి తీసుకెళ్లారు. ఇది అడల్ట్ మూవీ, నగ్నంగా నటించాలని చెప్పారు. నేను కుదరదన్నాను. అగ్రిమెంట్ పై సైన్ చేశావ్, కాబట్టి నటించాల్సిందే అన్నారు. అగ్రిమెంట్ క్యాన్సిల్ కావాలంటే రూ. 5 లక్షలు కట్టుమని బెదిరించారు.

తప్పించుకోలేకపోయాను..

తప్పించుకోలేకపోయాను..

మేము వెళ్లింది ఒక మారుమూల ప్రాంతం. కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోలేకపోయాను. ఇప్పుడు ఆ మూవీ ఓటీటీలో విడుదల కాబోతుంది. అది గనుక విడుదలైతే నా తల్లిదండ్రులకు, స్నేహితులకు నా మొహం చూపించుకోలేను. నాకు ఇక చావే దిక్కు'' అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు నటుడు.

పోలీసుల విచారణ..

పోలీసుల విచారణ..

బుల్లితెర నటుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అనంతరం ఆ మహిళా డైరెక్టర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమా ఓటీటీలో విడుదలవ్వకుండా పోలీసులు అడ్డుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X