యువ నటి సూసైడ్‌లో ట్విస్ట్.. నమ్మకం కోల్పోవడానికి క్షణం చాలు.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
మలయాళ సినీ పరిశ్రమను సూసైడ్ సంఘటనలు వెంటాడుతున్నాయి. అపర్ణా నాయర్ మరణ వార్తను ఇంకా మరిచిపోక ముందే యువ నటి సూసైడ్ చేసుకోని మరణించడం తీవ్ర విషాదంగా మారింది. యువ నటి రంజూషా మీనన్ బలవన్మరణానికి పాల్పడటం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఆమె మరణాన్ని స్నేహితులు, శ్రేయోభిలాషులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే రెంజూషా మీనన్ చివరి సోషల్ మీడియా పోస్టు వైరల్ అవ్వడమే కాకుండా.. గుండెను పిండేసేలా చేస్తున్నది. తన చివరి సోషల్ మీడియా పోస్టులో ఆమె రాశారంటే?
మలయాళంలో వర్థమాన నటిగా రాణిస్తున్న రెంజూష మీనన్ తిరువనంతపురంలోని తన ఫ్లాట్‌లో మరణించిన వార్త సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేసింది. సోమవారం (అక్టోబర్ 30వ తేదీ) ఉదయం ఫోన్ చేసిన ఎత్తకపోవడంతో ఆమె ప్రియుడు, రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్న మనోజ్ ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో షాక్ గురైన ఆయన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీడియాకు వెల్లడించారు.

అయితే రెంజూషా మీనన్ సూసైడ్ వెనుక ఆమెకు ఉన్న ఆర్థిక సమస్యలే కారణమనే కోణం బలంగా వినిపిస్తున్నది. అయితే ఆమె సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తే.. ఏదో డిప్రెషన్‌కు గురి అవుతున్నారనే విషయం స్పష్టమైంది. ఆమె చేసిన పోస్టుల వివరాల్లోకి వెళితే.. భావోద్వేగంతో తన వ్యక్తిగత విషయాలపై మనస్తాపం చెందినట్టు కనిపించింది.
రెంజూషా మీనన్ పోస్టులను పరిశీలిస్తే.. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్‌టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారనేది కనిపించింది. రీల్స్, సంతోషకరమైన వార్తలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజుల క్రితం తన పోస్టులకు భిన్నంగా ఓ మెసేజ్‌ను షేర్ చేసింది. డిప్రెషన్, నమ్మకం, సపోర్ట్ అంటూ కొన్ని విషయాలను ప్రస్తావించింది.

అయితే కొద్ది రోజుల క్రితం రెంజూషా మీనన్ చేసిన పోస్టు చర్చనీయాంశమవుతున్నది. తన మనసులోని బాధను వెల్లడించే ప్రయత్నంలో.. నిద్ర చాలా సౌకర్యంగా ఉంది. కానీ నేను విషాదంలో లేను. అలాగే నేను కోపంలో లేను. నేను ఒంటరితనంతో బాధపడటం లేదు. కానీ నేనంటో నాకే బోధపడటం లేదు అని రెంజూషా మీనన్ తన పోస్టులో పెట్టారు.
అయితే రెంజూషా మరో పోస్టులో నర్మగర్భమైన విషయాన్ని షేర్ చేసుకొన్నది. ఒకరిపై నమ్మకాన్ని పెంచుకోవాలంటే.. కొన్ని ఏంఢ్లు పెడుతున్నది. ఆ నమ్మకం కోల్పోవడానికి క్షణం చాలు అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నది. ఎవరైనా ఆమెను నమ్మించి మోసం చేశారా? నయవంచనకు గురైందా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

రెంజూషా మీనన్ మరణం వెనుక అనేక ఊహాగానాలు జోరందుకొన్నాయి. అయితే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన కేరళ పోలీసులు ఆమె దేహాన్ని పోస్టు మార్టమ్ పంపించి ఇన్వస్టిగేషన్ చేస్తున్నారు. అయితే రెంజూషా మరణంతో షాక్ గురైన అభిమానులు, స్నేహితులు తమ అనుబంధాన్ని సోషల్ మీడియాలో గుర్తు చేసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











