twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్తమానం సినిమాకు సెన్సార్ నిరాకరణ.. రాజకీయాలు చేస్తున్నారంటూ అధికారులపై నిర్మాత ఆగ్రహం

    |

    దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనను కథా నేపథ్యంగా తెరకెక్కించిన వర్తమానం సినిమాకు సెన్సార్‌ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బ్రేకులు వేసింది. అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయనే ఆరోపణలపై సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిసింది.

    టాలెంటెడ్ యాక్టర్ పార్వతి తిరువోత్‌ ప్రధాన పాత్రలో వర్తమానం చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సిద్దార్థ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళ నుంచి పీహెచ్‌డీ చేయడానికి ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌కు వెళ్లిన సందర్భంగా ఆమె జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    వర్తమానం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంపై నిర్మాత, స్క్రిప్టు రైటర్, కాంగ్రెస్ నేత ఆర్యదన్ షౌకత్ స్పందించారు. కారణాలు చెప్పకుండా సర్టిఫికెట్ నిరాకరించారని ఆయన ఆరోపించారు. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించామని సీబీఎఫ్‌సీ అధికారులు చెప్పరాని పేర్కొన్నారు.

     Varthamanam on JNU agitation: Producer on fire over Censor Board denied certification

    డిసెంబర్ 31వ తేదీలోపు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇవ్వకపోతే.. ఎలాంటి అవార్డులకు పంపడానికి వీలుండదు. కేవలం రాజకీయ కారణాలతోనే సినిమాను అడ్డుకొంటున్నారు అని షౌకత్ ఆరోపించారు.

    వర్తమానం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించినట్టు బోర్డు సభ్యుడు వీ సందీప్ కుమార్ చేసిన ట్వీట్‌ను షౌకత్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేశారు.

    English summary
    Varthamanam on JNU agitation: Producer on fire over Censor Board denied certification. CBFC stated that movie has been sent to revising committee of the Censor Board. Producer Aryadan Shoukath serious over the CBFC politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X