ఎవర్ గ్రీన్ మెలోడి ఆఫ్ మాస్టర్ కన్నుమూత.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతితో..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంకే అర్జునన్ ఇకలేరు. గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడతూ ఆయన కేరళలోని కోచిలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. ఆయన అర్జునన్ మాస్టర్‌గా సుపరిచితులు. తన కెరీర్‌లో 700 పాటలకుపైగా సంగీతం సమకూర్చారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ మెలోడి ఆఫ్ మాస్టర్ అనే పేరును సంపాదించుకొన్నారు.

తొలుత నాటక రంగంలో అనుభవం గడించిన తర్వాత 1968లో అర్జునన్ మాస్టర్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు కురథ పౌర్ణమి అనే సినిమా రంగంలోకి ప్రవేశించి ఆయన 50 ఏళ్ల పాటు సంగీతకారుడిగా సేవలందించారు. జీవితం కాలంలో 800 పాటలు, 300 నాటకాలకు సంగీతం అందించారు.

Vetaran Music Director MK Arjunan no more

2018లో జయరాజ్ దర్శకత్వం వహించిన భయానకం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా తొలి స్టేట్ అవార్డును సొంతం చేసుకొన్నారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్‌లోని ప్రతిభను గుర్తించి ఆయనను ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో అర్జునన్ మాస్టర్ ఒకరు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన అడిమచన్‌గల మూవీకి కీ బోర్డు ప్లేయర్‌గా రెహ్మాన్ పనిచేశారు.

సుమారు 50 ఏళ్లకుపైగా సంగీత ప్రపంచానికి సేవలందించిన అర్జునన్ మాస్టర్ ఇకలేరనే వార్తతో చలన చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాప ప్రకటనలో వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X