‘ ఆ హీరో ప్యాకెట్ బయటికి తీసి .. నా బట్టలు విప్పమంటూ ’

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు, మహిళా నటులపై వేధింపులకు సంబంధించి రోజుకొకరి బాగోతం వెలుగులోకి వస్తోంది. పైకి పెద్ద మనుషులుగా చలామణీ అవుతూ చీకటి పనులు చేసే ఎంతో మందికి సంబంధించిన వివరాలను నటీనటులు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్.. హీరోతో తాను షూటింగ్ స్పాట్‌లో ఎదుర్కొన్న ఇబ్బంది గురించి వెల్లడించి బాంబు పేల్చింది. దీనికి సంబంధించిన వివరల్లోకి వెళితే..

గతేడాది మలయాళ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ భారతీయ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ మాఫియా కింద నడుస్తోందని, మహిళా నటులు తమపై జరిగిన అఘాయిత్యాలపై నోరు విప్పలేకపోతున్నారని తెలిపింది. హేమ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ , వేధింపులు తదితర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

Vincy Aloshious comments on Malayalam star hero he misbehave with me during movie shooting

ఒక్క మలయాళ పరిశ్రమే కాకుండా భారత్‌లోని అన్ని ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్స్, నటీనటులు కూడా తాము ఎదుర్కొన్న సంఘటనలను బయటపెడుతున్నారు. కొందరైతే హేమ కమిటీ లాంటిది మాకు కూడా కావాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. హీరోయిన్లకు సెట్‌లో రక్షణ ఉండదని.. హీరో నుంచి లైట్‌మెన్ల వరకు తమను లోబరచుకోవడానికీ, ఏదో రకంగా కమిట్‌మెంట్‌కు ఒప్పించేలా చూస్తారని పలువురు తెలిపారు. షూటింగ్ ముగిసిన తర్వాత సెట్‌లో మగాళ్లంతా ఆకలిగా ఉన్న సింహాల మాదిరిగా అటు ఇటు తిరుగుతారని పేర్కొన్నారు. తాజాగా మలయాళ నటి విన్సీ సోనీ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు.

2019లో వికృతి సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన విన్సీ .. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జనగణమన, 1744 వైట్ ఆల్టో, సౌదీ వెళ్లక్క, రేఖ, పద్మిని, ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్ వంటి చిత్రాల్లో నటించారు. రేఖ చిత్రంలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారంతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు విన్సీ. సినిమాలతో పాటు సీరియల్స్ , వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ మోస్ట్ వాంటెడ్ నటిగా నిలిచారు. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన విన్సీ అవకాశం వస్తే ఇతర భాషల్లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు.

తాజా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విన్సీ సోనీ మాట్లాడుతూ.. ఓ హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ స్టార్ హీరో డ్రగ్స్ తీసుకుని వచ్చాడని.. సరిగ్గా ఆ సమయంలోనే సీన్‌కు తగ్గ దుస్తుల విషయంలో ఇబ్బంది తలెత్తిందని విన్సీ తెలిపింది. దాంతో తాను కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి వెళ్తుండగా.. ఆ హీరో తన ఒంటిపై చేయి వేసి డ్రెస్ సరిచేయడానికి యత్నించాడని ఆరోపించింది.

తన ముందే బట్టలు వేసుకోవాల్సిందిగా టార్చర్ చేశాడని.. ఓ ప్యాకెట్ తీసి తెల్లటి పొడిని నోట్లో వేసుకోవడం కనిపించిందని విన్సీ పేర్కొంది. ఈ ఘటన తర్వాత డ్రగ్స్ తీసుకునే వారితో నటించకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విన్సీని ఇబ్బంది పెట్టిన హీరో ఎవరనే దానిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X